సొట్టబుగ్గలు వచ్చేలా నవ్వుతూ.. క్యూట్ సెల్ఫీలతో కట్టిపడేస్తున్నలావణ్య త్రిపాఠి.. టాప్ షోతో రచ్చ..

First Published | Jun 5, 2023, 7:50 PM IST

యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)  క్యూట్ సెల్ఫీలతో కట్టిపడేస్తోంది. సొట్టబుగ్గల సుందరి లేటెస్ట్ పిక్స్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ‘అందాల రాక్షసి’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ పదేళ్లుగా వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తోంది. 
 

హీరోయిన్ గా తెలుగు, తమిళంలోనూ సినిమాలు చేస్తూ వస్తోంది. టాలీవుడ్ లోనే ఎక్కువగా ఆఫర్లు అందుకుంటోంది. గతంలో వరుసపెట్టి సినిమాలు చేసింది. ప్రస్తుతం కాస్తా జోరు తగ్గింది. కానీ మళ్లీ స్పీడ్ పెంచుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన సినిమాల అప్డేట్స్  అందిస్తూనే ఉంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది. తాజాగా క్యూట్ సెల్ఫీలతో యూపీ బ్యూటీ కట్టిపడేసింది.
 


గ్లామర్ షోకు లావణ్య త్రిపాఠి చాలా దూరంగా ఉంటుంది. ఎప్పుడూ ట్రెడిషనల్ అండ్ ట్రెండీ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తుంటుంది. కానీ ఏమాత్రం స్కిన్ షోకు ఛాన్స్  ఇవ్వదు. కొన్ని సందర్భాల్లో గ్లామర్ మెరుపులతో ఆకట్టుకుంది. ఇక లేటెస్ట్ గా పంచుకున్న పిక్స్ తో మతులు పోగొట్టింది.
 

స్లీవ్ లెస్ టాప్ లో లావణ్య త్రిపాఠి అందాల విందు చేసింది. నేచురల్ అందంతో కట్టిపడేసింది. టాప్ షోతో పాటు ఆకర్షించే రూపసౌందర్యంతో ఈ ముద్దుగుమ్మ చూపుతిప్పుకోకుండా చేసింది. మత్తెక్కించే చూపులు, అట్రాక్ట్ చేసే అందంతో కుర్రాళ్లను మైమరిపించింది. యంగ్ బ్యూటీ అందానికి ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

అందం విషయంలో, ఫిట్ నెస్ విషయంలో లావణ్య ఎప్పుడూ శ్రద్ధ వహిస్తుంటుంది. తాజాగా సూర్య రష్మిని పొందుతూ ఇలా సెల్ఫీలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్  నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు ఈ ముద్దుగుమ్మ త్వరలో మెగా కోడలు కాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతనేది చూడాలి.

కొద్దిరోజులుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య డేటింగ్ లో ఉందని, త్వరలోనే వీరి ఎంగేజ్ మెంట్ కూడా ఉంటుందంటూ ఇటీవల వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై అటు వరుణ్, ఇటు లావణ్య స్పందించలేదు. అలాగనీ ఖండించనూ లేదు. ఇక లావణ్య చివరిగా ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ, ‘పులి మేక’ సిరీస్ తో అలరించింది. ప్రస్తుతం తమిళంలో ‘తానల్‘ చిత్రంలో నటిస్తోంది.
 

Latest Videos

click me!