Adipurush First Look: కనిపించని రాముడు... రూల్స్ బ్రేక్ చేసిన ప్రభాస్ ఆగ్రహానికి గురికాడు కదా!

Published : Sep 30, 2022, 11:31 AM ISTUpdated : Sep 30, 2022, 11:59 AM IST

రామునిగా ప్రభాస్ ఎలా ఉంటాడనే ఉత్కంఠ ఈనాటిది కాదు. ఆదిపురుష్ ప్రకటన నాటి నుండి అభిమానులతో పాటు ప్రతి మూవీ లవర్ లో ఈ ఆసక్తి, ఆత్రుత నెలకొని ఉంది. ఎట్టకేలకు కొంత క్లారిటీ వచ్చింది. నేడు ఆదిపురుష్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా ఒకింత ఆశ్చర్యం కలిగింది.

PREV
17
Adipurush First Look: కనిపించని రాముడు... రూల్స్ బ్రేక్ చేసిన ప్రభాస్ ఆగ్రహానికి గురికాడు కదా!
Prabhas

ఎందుకంటే ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఊహించిన గెటప్ అది కాదు. అందరి అంచనాలకు, ఆలోచనలకు భిన్నంగా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఉంది. కారణం ట్రెడిషన్ బ్రేక్ చేయడమే. రామాయణం ఓ విశిష్ట కావ్యం. రాముడు హిందువుల ఆరాధ్య దైవం. అలాగే ఎవర్ గ్రీన్ సినిమాటిక్ సబ్జెక్టు.

27

భారత చలన చిత్ర పరిశ్రమ పురుడు పోసుకున్న నాటి నుండి వందకు పైగా చిత్రాలు రామాయణం ఆధారంగా తెరకెక్కాయి. కొన్ని సంపూర్ణ రామాయణం కథలుగా తెరకెక్కితే, మరికొన్ని అందులోని అధ్యాయాలు ప్రధానంగా రూపొందాయి. ఎన్ని చిత్రాలు వచ్చినా? ఎవరు రాముని పాత్ర చేసినా.. లుక్ మాత్రం సేమ్.

37

నీల వర్ణం, కిరీటం, ప్రశాంత వదనం, చేతిలో ధనుస్సు, నుదుట నామం, ఒంటి నిండా ఆభరణాలతో సుమనోహరంగా రాముడు లుక్ తీర్చిదిద్దుతారు. నల్లవాడైనా రాముడు అందగాడు. అందుకునే సీత మనసు తొలిచూపులోనే దోచేశాడు. శివధనస్సు విరిచి సొంతం చేసుకున్నాడు. అరణ్యవాసానికి మేకర్స్ పురాణాల ఆధారంగా మరొక గెటప్ సెట్ చేశారు. 
 

47

తండ్రి ఆజ్ఞ మేరకు అడవులకేగిన రాముడు నిరాడంబరంగా ఉంటారు. పంచె, ఒంటిపై జంధ్యం, జుట్టు ముడివేసి, చేతిలో ధనస్సు, మెడలో రుద్రాక్షలు, ముఖాన నామం పెట్టుకున్న రాముడ్ని మనం అరణ్యవాసంలో చూడొచ్చు. ఏళ్లుగా వెండితెరపై రాముడంటే ఈ రెండు గెటప్స్ మాత్రమే ప్రేక్షకులకు తెలుసు.

57
Prabhas


ఈ ట్రెడిషన్ ప్రభాస్ బ్రేక్ చేశాడు. కంప్లీట్ డిఫరెంట్ గా ఆయన లుక్ ఉంది. రామునితో పోల్చుకునే ఒక్క లక్షణం ప్రభాస్ గెటప్ కలిగి లేదు. అసలు కోర మీసం కాన్సెప్ట్ ఇంత వరకు ఎవరూ వాడిన దాఖలాలు లేవు. ప్రభాస్ కాస్ట్యూమ్ సైతం ప్రేక్షకుల ఆలోచనలకు అందగకుండా డిజైన్ చేశారు. 

67

ప్రభాస్ ఆదిపురుష్ ఫస్ట్ లుక్ చూశాక... అసలు ఇది రామాయణ గాథేనా? రాముని గెటప్పేనా అన్న సందేహాలు మొదలయ్యాయి. అలాగే మత పరమైన అంశం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. . ఏమాత్రం భక్తుల మనోభావాలు దెబ్బతిన్న అసలుకే మోసం వస్తుంది. అందులోనూ మెజారిటీ వర్గానికి చెందిన హిందువుల దేవుడు.

77


ప్రస్తుతానికి కేవలం ఒక లుక్ మాత్రమే బయటికి వచ్చింది. అక్టోబర్ 2న టీజర్ విడుదల అవుతుండగా ఒక క్లారిటీ వచ్చే సూచనలు కలవు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ 2023 జనవరి 12న విడుదల కానుంది. కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories