జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు స్టార్ డైరెక్టర్. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఓ సినిమా సీక్వెల్ పై ఆశలు వదిలేసుకోవాలని హింట్ ఇచ్చేశాడు. ఇంతకీ ఏంటా సినిమా? ఎవరా దర్శకుడు.
నందమూరి అభిమానులను మాత్రమే కాదు..ప్రతీ తెలుగు ప్రేక్షకుడిని కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన మూవీ అదుర్స్. రిలీజ్ అయ్యి 15 ఏళ్లు పైన అవుతున్నా.. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా.. బోర్ కొట్టకుండా నవ్విస్తూనే ఉంది అదుర్స్. జూనియర్ ఎన్టీఆర్, నయనతార, షీలా కౌర్ జంటగా.. వివి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన కామెడీ..యాక్షన్ మూవీ అదుర్స్. బ్రహ్మానంద, ఎన్టీఆర్ కామెడీతో కడుపు చెక్కలయ్యేలా కామెడీ వర్షం కురిపించిన ఈసినిమా.. నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ సక్సెస్ ను సాధించింది.
26
ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అదుర్స్..
తారక్ కెరీర్‌లో ఎన్ని సినిమాలు ఉన్నా.. ఎన్ని హిట్లు ఉన్నా.. ఎన్ని బ్లాక్‌బస్టర్‌లు ఉన్నా అదుర్స్ మూవీ అప్పటికీ..ఇప్పటికీ స్పెషల్. ముఖ్యంగా బ్రాహ్మణుడిగా తారక్.. ఆయన గురువుగా బ్రహ్మానందం.. గురు శిష్యులు గా బ్రహ్మీ,తారక్ మధ్య కామెడీ.. తలుచుకుంటేనే నవ్వు తన్నుకొస్తుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో వీరిద్ధరి ఎక్స్‌ప్రెషన్లు మీమ్స్ రూపంలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఎన్టీఆర్ కిల్లర్ గా, బ్రాహ్మణుడిగా డ్యూయల్ రోల్ చేశాడు. ఈ రెండు పాత్రల క్యారెక్టరైజేషన్ బాగా కుదిరింది. ముఖ్యంగా చారి పాత్రలో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కేక అని చెప్పాలి. ఎన్టీఆర్-బ్రహ్మానందం కామెడీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్.
36
అదుర్స్ సీక్వెల్ కోసం ఎదురుచూపులు..
ఇక ఈసినిమాపై ఎప్పటికప్పుడు రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అదుర్స్ సినిమాకు సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కొత్త కాన్సెప్ట్ తో మళ్లీ థియేటర్లలో సందడి చేస్తే చూడాలని కామెడీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. గతంలో ఈసినిమా కు సీక్వెల్ ఉంటుందన్నట్టుగా హింట్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ విషయంలో అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ఈ విషయంపై రీసెంట్ గా దర్శకుడు వినాయక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదుర్స్ సీక్వెల్ పై ఆశలు వదిలేసుకోక తప్పేలా లేదు.
ఒక సినిమా ఈవెంట్ లో మాట్లాడిన వీవీ వినాయక్ అదుర్స్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. నిజంగా చెప్పాలంటే అదుర్స్2 కు స్కోప్ లేదు. ఆ కథ అక్కడితోనే ముగిసిపోయింది. సీక్వెల్ చేయడానికి ఇప్పుడు అందులో ఏమీ మిగలలేదు, ఒకవేళ బలవంతంగా తీసినా.. ఫస్ట్ పార్ట్ మూవీ లో అందించిన కామెడీ.. అదే డెప్త్ తో రీక్రియేట్ చేయగలమన్న నమ్మకం తనకు లేదని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. అందుకే ఆ సినిమాను ఒక అందమైన జ్ఞాపకంలా వదిలేయడమే మంచిదని వినాయక్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దాంతో తారక్ అభిమానులకు నిరాశ తప్పలేదు.
56
అదుర్స్ సీక్వెల్ కష్టమేనా..?
ఒక వేళ అదుర్స్ 2 కి అద్భుతమైన కథ రెడీ అయినా.. ప్రస్తుతం వివి వినాయక్ ఫామ్ లో లేడు.. జూనియర్ ఎన్టీఆర్ అందుబాటులో లేడు. ఈ కాంబినేషన్ కలిసేందుకు ఎక్కడా స్కోప్ లేనే లేదు. చత్రపతి హిందీలో రీమేక్ చేసి.. డిజాస్టర్ ను ఫేస్ చేశాడు వినాయక్. ఇక ఇప్పట్లో ఆయన సినిమావైపు వెళ్లే ఆలోచనే చేయడంలేదు. ఆర్ఆర్ఆర్, దేవర లాంటి పాన్ఇండియా హిట్లు కొట్టిన ఎన్టీఆర్.. అంతకు మించిన సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. సో.. ఈ టైమ్ లో ఎన్టీఆర్ మళ్లీ అదుర్స్ లాంటి ప్రయోగం చేయడనే తెలుస్తోంది.
66
ఎన్టీఆర్ సినిమాలు..
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పాన్ వరల్డ్ కాన్సెప్ట్ తో ఈమూవీ తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈసినిమా కోసం తారక్ భారీగా బరువు తగ్గాడు. ఎవరు గుర్తు పట్టని విధంగా తన లుక్ ను ఛేంజ్ చేశాడు. అసలు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఏం చేయబోతున్నాడబ్బా.. అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమా తరువాత తారక్ దేవర 2 షూటింగ్ లో జాయిన్ అవుతాడని సమాచారం. ఆతరువాత కూడా వరుసగా పాన్ ఇండియా మూవీస్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు యంగ్ టైగర్.