జూనియర్ ఎన్టీఆర్ తో అదుర్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తోన్న వి.వి. వినాయక్, బ్రహ్మీ పాత్ర ఎవరు చేయబోతున్నారంటే?

Published : Aug 27, 2025, 03:56 PM IST

ఈమధ్య సూపర్ హిట్ సినిమాలకు రీరిలీజ్ లు, సీక్వెల్స్ కామన్ గా మారాయి. హిట్ సినిమాలకు కొత్త కథలు తయారు చేసి, సీక్వెల్స్ ను వర్కౌట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అదుర్స్ పార్ట్ 2 త్వరలో సందడి చేయబోతోంది.  

PREV
14

2010లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది 'అదుర్స్' సినిమా. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఎన్టీఆర్, వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మాస్-కామెడీ ఎంటర్టైనర్‌ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ఈ హిట్ కాంబో మళ్లీ తెరపైకి రాబోతోందన్న వార్తలు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

24

తాజా సమాచారం ప్రకారం, ‘అదుర్స్ 2’ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం. దర్శకుడు వి.వి.వినాయక్, మొదటి భాగానికి కొనసాగింపుగా స్క్రిప్ట్‌ను భారీ స్థాయిలో రెడీ చేస్తున్నారని, ఇందులో ఎన్టీఆర్ మళ్లీ డ్యూయల్ రోల్‌లో నటించనున్నారని టాక్. ముఖ్యంగా ‘చారి’ పాత్రకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఆ క్యారెక్టర్‌ను మరింత ఎలివేట్ చేసేలా కథను రూపొందిస్తున్నారని సమాచారం.ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, మాస్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా వినాయక్ కథను రెడీ చేస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

34

ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ యాక్షన్, ఎన్టీఆర్ ఎనర్జీతో పాటు పంచ్ డైలాగ్స్, కామెడీ ట్రాక్ ఈ సినిమాలో కీలకంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈసారి కథలో కొంత భాగం అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందట. దీనివల్ల కామెడీ సీన్స్ మరింత ఫ్రెష్‌గా ఉండే అవకాశముంది. ఇదిలా ఉండగా, మొదటి పార్ట్‌లో భట్టాచార్య పాత్రలో బ్రహ్మానందం చేసిన పాత్ర ఎంతగానో హైలైట్ అయింది. ఇప్పుడు అదే స్థాయిలో కామెడీని అందించేందుకు దర్శకుడు వినాయక్, కమెడియన్ సత్యను బలమైన పాత్రలో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ వర్గాల్లో చర్చ.

44

సత్య - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వినాయక్ ప్రత్యేకమైన కామెడీ ట్రాక్‌ను ప్లాన్ చేస్తున్నట్టు టాక్. సత్యకు ఉన్న టైమింగ్, ఎన్టీఆర్ ఎనర్జీతో కలిస్తే సినిమాకు ఇది ప్రధాన హైలైట్‌గా మారే అవకాశముందని భావిస్తున్నారు.ప్రస్తుతం ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ వార్తలపై ఎన్టీఆర్ అభిమానుల్లో హైప్ మొదలైపోయింది. ఎన్టీఆర్ 'దేవర' తర్వాత చేయబోయే సినిమా ఇదేనా?, లేక ఇది తర్వాతిదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇది సీక్వెల్ అయితే, అదుర్స్-2 సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడే అవకాశం ఉంది.ప్రస్తుతం వి.వి.వినాయక్ స్క్రిప్ట్ పనులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అతి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories