Pushpa: పుష్ప 2లో రష్మిక పాత్రపై నిర్మాత ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి.. అంతా చెత్త అంటూ షాకింగ్ కామెంట్స్

First Published Jun 23, 2022, 9:48 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ మాస్ మ్యానరిజమ్స్, ఎర్రచందనం స్మగ్లర్ గా నటన ప్రతి అంశం హిందీ ప్రేక్షకులని మెప్పించాయి. 

అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రలో రష్మిక కూడా ఒదిగిపోయి నటించింది. గ్లామర్ ఒలకబోస్తూ యువతని మెప్పించింది. దీనితో ప్రస్తుతం దేశం మొత్తం పుష్ప 2 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. పుష్ప 2..పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కనుంది. ఆగష్టు నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 

ఈలోపు పుష్ప 2 కథపై అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. పుష్ప 2లో అనసూయ పాత్ర గురించి, రష్మిక పాత్ర గురించి పుకార్లని వండి వార్చేస్తున్నారు. ఇటీవల రష్మిక శ్రీవల్లి పాత్ర గురించి షాకింగ్ రూమర్ వైరల్ అయింది. పుష్ప 2లో శ్రీవల్లి చనిపోతుంది అని.. కథలో సుకుమార్ రాసుకున్న పెద్ద ట్విస్ట్ ఇదే అంటూ ప్రచారం జరిగింది.  హీరోయిన్ పాత్రే చనిపోతుందని వార్తలు రావడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. 

ఈ రూమర్స్ పై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవి శంకర్ స్పందించారు. శ్రీవల్లి చనిపోతుందన్న వార్తలపై.. అదంతా చెత్త, నాన్సెన్స్.. ఆ రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదు. కథ ఎవరికీ తెలియదు కాబట్టి సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్ వస్తుంటాయి. చాలా మంది ఇదే నిజం అని నమ్మేస్తుంటారు అని రవిశంకర్ అన్నారు. 

పుష్ప 2 కథ మాకే సరిగ్గా తెలియదు. అలాంటప్పుడు బయట జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవమే అని అన్నారు. అలాగే అనసూయ అల్లు అర్జున్ ని వెన్నుపోటుకి ప్లాన్ చేస్తుందని.. ఆమె పాత్ర పుష్ప 2లో మరింత క్రూయల్ గా ఉండబోతోందని కూడా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. 

పుష్ప పాన్ ఇండియా స్థాయిలో వర్కౌట్ అయింది కాబట్టి పుష్ప 2పై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే పుష్ప 2 ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు పార్ట్ 2 కోసం 400 కోట్ల బడ్జెట్ కేటాయించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

click me!