ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు అదాశర్మ. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతరువాత సెకండ్ హీరోయిన్ పాత్రలవైపు మళ్లింది అదా శర్మ.
సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి మెపపించింది. కొన్నాళ్లతరువాత తెలుగు తెరకు దూరమయ్యి.. బాలీవుడ్ వైపు మళ్లింది. అక్కడ కేరళ స్టోరీ సినిమాతో అదాను లక్కు పలకరించింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు దాదాపు 400 కోట్లకుపైగ కలెక్షన్స్ ను సాధించింది. నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ హీరోయిన్.