పెళ్లిపై నటి యామీ గౌతమ్ షాకింగ్ కామెంట్స్.. నిజంగా ‘పొరపాటే’ అంటున్న యంగ్ బ్యూటీ!

First Published Dec 11, 2022, 6:03 PM IST

యంగ్ బ్యూటీ యామీ గౌతమ్ (Yami Gautam) పెళ్లిపై  తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హీరోయిన్ల విషయంలో ఆ విధంగా ఆలోచిస్తే పొరపాటే అవుతుందని బాలీవుడ్ బ్యూటీ తన అభిప్రాయాన్ని వ్యక్తం  చేసింది.
 

బాలీవుడ్ నటిగా దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ యామీ గౌతమ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే ఫుల్ బిజీ అయిన నార్త్ బ్యూటీ యామీ గౌతమ్ విభిన్న  పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

తెలుగు ఆడియెన్స్ కు కూడా యామీ గౌతమ్ ఆయా చిత్రాలతో దగ్గరైంది. ‘నువ్విలా’,‘గౌరవం’,‘యుద్ధం’, ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాలతో అలరించింది.  చివరిగా నితిన్ సరసన నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత పూర్తిగా నార్త్ లోనే సెటిల్ అయ్యింది.
 

ప్రస్తుతం యామీ గౌతమ్ నటించిన ‘లస్ట్’,‘చోర్ నికల్ కె బాగా’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హిందీ సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంటున్నన ఈ బ్యూటీ అప్ కమింగ్ ఫిల్మ్స్ ప్రమోషన్స్ లో ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా ఉంటోంది. 

గతేడాది రచయిత, డైరెక్టర్ ఆదిత్య ధర్ ను పెళ్లి చేసుకుంది యంగ్ బ్యూటీ యామీ గౌతమ్. పెళ్లి తర్వాత  కూడా వెండితెరకు దూరం కాని ఈ బ్యూటీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో మ్యారేజ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం  ఈమె కామెంట్స్ వైరల్ గా మారాయి.
 

యామీ గౌతమ్ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత హీరోయిన్ల కేరీర్ ముగిసిందనుకోవడం పొరపాటే అవుతుంది.  అన్ని ఇండస్ట్రీల్లో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కేరీర్ లో దూసుకుపోతున్న హీరోయిన్లు ఉన్నారు. సినీ కేరీర్ కు పెళ్లి ఏమాత్రం అడ్డు కాదనేది గ్రహించాలి.  
 

ప్రతి  మహిళ తన  లైఫ్ లో ఎన్నో డ్రీమ్ ను నెరవేర్చుకోవాలనుకుంటుంది.  అందులో పెళ్లి  ఒకటి. పెళ్లి తర్వాత  మరింత బాధ్యగా వ్యవహరిస్తారే తప్పా.. వారి సినిమాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. లైఫ్ పార్టనర్ అర్థం చేసుకుంంటే కేరీర్ సాఫీగా వెళ్లిపోతుందంటూ కామెంట్స్ చేసింది. ఈ  కామెంట్స్ తో యామీ గౌతమ్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం యామీ గౌతమ్ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
 

click me!