Rashmika Mandanna: క్లోజప్ షాట్ లో టూ మచ్ హాట్... కళ్ళతో కవ్విస్తూ అది కోరుకున్న రష్మిక!

Published : Dec 11, 2022, 05:22 PM IST

స్టార్ లేడీ రష్మిక మందాన క్లోజప్ షాట్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. హాలీవుడ్ భామలను తలపిస్తూ కళ్ళతో కవ్వించింది. లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన రష్మిక తన నాటీ ఫోజులకు క్యాప్షన్ ఇవ్వండని నెటిజెన్స్ ని అడిగింది.   

PREV
18
Rashmika Mandanna: క్లోజప్ షాట్ లో టూ మచ్ హాట్... కళ్ళతో కవ్విస్తూ అది కోరుకున్న రష్మిక!
Rashmika Mandanna

ఈ మధ్య రష్మిక వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆమెను కన్నడ పరిశ్రమ బ్యాన్ చేసిందంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై రష్మిక స్పందించారు. అవన్నీ అపోహలు మాత్రమే అని కొట్టిపారేశారు. 
 

28
Rashmika Mandanna

ప్రస్తుతం రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది. ఈ స్టార్ లేడీ బడా బడా స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు. పుష్ప మూవీతో ఫస్ట్ పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకున్న రష్మిక మందాన ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు. అనతి కాలంలో ఎదిగిన ఈ లక్కీ లేడీ సౌత్ టు నార్త్ దున్నేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాలకు ఈమె కేరాఫ్  అడ్రస్ అయ్యారు. 

38
Rashmika Mandanna


పుష్ప 2, యానిమల్, వారసుడు , మిషన్ మజ్ను చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. పుష్ప 2 రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో దర్శకుడు సుకుమార్ భారీగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. సీక్వెల్ లో అల్లు అర్జున్(Allu Arjun) తో రష్మిక కెమిస్ట్రీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. త్వరలో హైదరాబాద్ వేదికగా పుష్ప 2 షూట్ రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. 
 

48
Rashmika Mandanna

ఇక విజయ్ కి జంటగా చేస్తున్న వారసుడు(Varasudu) 2023 సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న వారసుడు చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మహర్షి మూవీతో మంచి హిట్ అందుకున్న వంశీ పైడిపల్లి చాలా గ్యాప్ తర్వాత వారసుడుతో వస్తున్నాడు. 
 

58


ఇక సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో సత్తా చాటాలని చూస్తున్నారు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో ఆయన భారీ విజయం అందుకున్నాడు. దీంతో రన్బీర్ కపూర్ ఆయనకు ఆఫర్ ఇచ్చాడు. యానిమల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. వైలెన్స్ కి యానిమల్ మూవీతో అసలైన అర్థం చెబుతానని సందీప్ రెడ్డి చెప్పడం ఆసక్తిరేపుతోంది. 

68


రష్మిక (Rashmika Mandanna)ఖాతాలో ఉన్న మరో బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ విడుదల కానుంది. కాగా రష్మిక ఫస్ట్ బాలీవుడ్ మూవీ గుడ్ బై ఇటీవల విడుదలైంది. అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రం పెద్దగా సందడి చేయలేదు. 

78


ప్రొఫెషనల్ లైఫ్ ఫుల్ స్వింగ్ లో ఉండగా రష్మిక మీద ఎఫైర్ రూమర్స్ ఎక్కువయ్యాయి. విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమాయణం నడుపుతున్నారని గట్టిగా వినిపిస్తోంది. ఈ రూమర్స్ రష్మిక గట్టిగా ఖండించకపోవడం విశేషం. అలా అని ఆమె నేరుగా ఒప్పుకోవడం లేదు. 

88


ఆ మధ్య విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్ళింది. ఫ్రెండ్ అంటూ ఇలా ఏకాంత విహారాలు చేస్తుంటే వారి మధ్య ఎఫైర్ నిజమే అంటున్నారు. విజయ్ దేవరకొండ-రష్మిక కాంబినేషన్ లో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు తెరకెక్కాయి. సిల్వర్ స్క్రీన్ పై ఈ జంట ఓ రేంజ్ రొమాన్స్ పండించారు. 

Read more Photos on
click me!

Recommended Stories