రూ.3000 నుంచి కోటి రూపాయల వరకు.. ఇలియానా కంటే ముందు అరుదైన రికార్డు సాధించిన హీరోయిన్

Published : Apr 21, 2025, 07:08 AM IST

టాలీవుడ్ లో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. వారి డామినేషన్ తట్టుకుని కూడా స్టార్లుగా ఎదిగిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. సావిత్రి, వాణిశ్రీ, విజయశాంతి ఇలా ప్రతి తరంలోనూ ఆశ్చర్యపరిచే స్టార్ డమ్ సొంతం చేసుకున్న నటీమణులు ఉన్నారు.

PREV
15
రూ.3000 నుంచి కోటి రూపాయల వరకు.. ఇలియానా కంటే ముందు అరుదైన రికార్డు సాధించిన హీరోయిన్
Ileana, Vijayashanthi

టాలీవుడ్ లో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. వారి డామినేషన్ తట్టుకుని కూడా స్టార్లుగా ఎదిగిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. సావిత్రి, వాణిశ్రీ, విజయశాంతి ఇలా ప్రతి తరంలోనూ ఆశ్చర్యపరిచే స్టార్ డమ్ సొంతం చేసుకున్న నటీమణులు ఉన్నారు. నటన పక్కన పెడితే కేవలం గ్లామర్ తో మాత్రమే టాప్ రేంజ్ కి చేరుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇలియానా ఆ కోవకు చెందిన నటే. 

25

పోకిరి తర్వాత ఆమె ఏకంగా కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకుని సంచలనం సృష్టించింది. టాలీవుడ్ లో కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్న తొలి హీరోయిన్ ఇలియానానే అని చాలా మంది అనుకుంటారు. కానీ కాదు. ఎందుకంటే ఇలియానా కంటే ముందే ఆ రికార్డ్ అందుకున్న క్రేజీ నటి ఒకరు ఉన్నారు. ఆమె ఎవరో కాదు.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. 

35

నటన, గ్లామర్ తో శ్రీదేవి లాంటి హీరోయిన్లు టాప్ పొజిషన్ కి చేరుకున్నారు. కానీ విజయశాంతికి వచ్చిన యాక్షన్ ఇమేజ్ ఇంకెవరికీ దక్కలేదు. హీరోలకు ఉండే మాస్ యాక్షన్ ఇమేజ్ ని విజయశాంతి 90 దశకంలోనే సొంతం చేసుకున్నారు. ప్రతిఘటన, కర్తవ్యం లాంటి చిత్రాలు విజయశాంతికి తిరుగులేని క్రేజ్ తీసుకొచ్చాయి. దీనితో ఆమె టాలీవుడ్ లో కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకునే నటిగా రికార్డ్ సృష్టించారు. ఇలియానా విషయానికి వస్తే ఆమె గ్లామర్ పరంగా కోటి రూపాయలు పారితోషికం అందుకుంది. 

45

విజయశాంతి స్టార్ హీరోలకు ధీటుగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ కోటి రూపాయలు పారితోషికం తీసుకునే వారు. ఒక సందర్భంలో విజయశాంతి తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. నా కెరీర్ బిగినింగ్ లో నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ 5 వేలు. అందులో కూడా 2 వేలు ఎగ్గొట్టి 3 వేలు మాత్రమే ఇచ్చేవారు. కానీ స్టార్ ఇమేజ్ వచ్చాక అక్షరాలా కోటి రూపాయలు డబ్బుని నిర్మాతలు తన ఇంటికి తీసుకువచ్చి ఇచ్చేవారు అని విజయశాంతి తెలిపారు. 

55

చాలా కిందిస్థాయి నుంచి మొదలైన తన జర్నీని తలుచుకుంటే గర్వంగా ఉంటుంది అని విజయశాంతి అన్నారు. విజయశాంతి 1980లో ఖిలాడీ కృష్ణుడు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటించిన విజయశాంతి రీసెంట్ గా కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లో నటించింది. 

Read more Photos on
click me!

Recommended Stories