Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు

Published : Dec 12, 2025, 08:34 PM IST

Vahini Battles Cancer : ఒకప్పుడు బుల్లితెర ఆడియన్స్ ను అలరించి సీనియర్ నటి వాహిని ఆరోగ్యం విషమంగా మారింది. పద్మక్క పాత్రతో ఫేమస్ అయిన ఈ నటి రొమ్ము క్యాన్సర్ తో గుర్తు పట్టకుండా మారిపోయింది. ఆరోగ్యం క్షీణించడంతో.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తోంది. 

PREV
14
బుల్లితెరపై పాపులర్ అయిన వాహిని

వాహిని ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటి. బుల్లితెరపై ఆమె చాలా సీరియల్స్ చేశారు. ముఖ్యంగా 90 s కిడ్స్ కు నిన్నే పెళ్లాడతా సీరియల్ లో వాహిని చేసిన మంజు పాత్ర గుర్తుండే ఉంటుంది. దాదాపు 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వాహిని అనేక సీరియల్స్‌ ద్వారా ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం నటి వాహిని తీవ్ర ఆరోగ్య సమస్యలతో పోరాటం చేస్తుంది. ఆర్దిక సమస్యలతో ట్రీట్మెంట్ కు సహాయం కోరుతుంది. సహజ నటనతో తెలుగు టెలివిజన్‌ ప్రేక్షకుల మనసు దోచిన వాహిని కొన్నేళ్లుగా తెరపై కనబడకపోవడంతో అభిమానులు ఆమె గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వాహిని.. అక్కడ కూడా కనిపించకపోవడంతో.. అసలు విషయం తెలిసి బాధపడుతున్నారు.

24
కరాటే కళ్యాణి వల్ల బయటకు వచ్చిన విషయం

వాహిని పరిస్థితి గురించి టాలీవుడ్ నటి నటి కరాటే కళ్యాణి అసలు విషయం బయటపెట్టారు. సోషల్‌మీడియా ద్వారా వాహిని ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె వెల్లడించరు. కళ్యాణి చెప్పడం వల్లే వాహిణి విషయం బయటికి వచ్చింది. గత కొన్ని నెలలుగా వాహిని అడ్వాన్స్‌డ్ స్టేజ్ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో కొన్ని అవయవాల పనితీరు కూడా క్షీణించినట్టు తెలుస్తోంది. దాంతో ఆమెను ప్రస్తుతం ఐసీయూలో ఉంచి.. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కీమోథెరపీ, నిరంతర వైద్య సేవలతో పాటు సర్జరీలు కూడా చేయాల్సి ఉండటంతో.. ట్రీట్మెంట్ కోసం 35 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు వాహిని కుటుంబానికి తెలియజేశారు.

34
కరాటే కళ్యాణీ సోషల్ మీడియా పోస్ట్

ఈ నేపథ్యంలో వాహిని చికిత్స కోసం ఆర్థిక సహాయం అవసరమైందని కరాటే కల్యాణి సోషల్‌మీడియాలో విజ్ఞప్తి చేశారు. ఆమె తన పోస్ట్ లో ఇలా రాశారు. “అందరికీ నమస్కారం… ఆర్టిస్ట్‌ జీవితం ఎప్పుడు ఎలా మలుపుతిరుగుతుందో తెలియదు. తెలుగులో ఎన్నో సినిమాలు, సీరియల్స్‌లో నటించిన పద్మక్క అలియాస్ వాహిని ప్రస్తుతం ప్రాణాంతక దశలో ఉంది. నెలలుగా రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఇప్పుడు పరిస్థితి చాలా సీరియస్ గా మారింది. అవయవాల పనితీరు కూడా తగ్గిపోయింది. ఆమెకు తక్షణ వైద్య సహాయం అత్యవసరం. మనందరం కలిసి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఒక ప్రాణాన్ని కాపాడుకుందాం.” అని పోస్ట్ చేశారు. ఇండస్ట్రీ పెద్దలతో పాటు.. అందరు స్పందించాలని కళ్యాణి కోరారు. అంతే కాదు వాహినికి సబంధించిన యూపీఐ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లను కూడా ఆమె పోస్ట్ చేయడంతో.. వాహిని పరిస్థితి తెలిసి చాలామంది స్పందిస్తున్నారు. వారికి తోచ్చినట్టుగా సాయం చేస్తున్నారు. వాహిని కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

44
సినిమాలు, సీరియల్స్ తో పాపులారిటీ

1978లో జన్మించిన వాహిని, ఎక్కువగా జయవాహిని పేరుతో ఫేమస్ అయ్యింది. తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా కొన్ని సీరిల్స్ లో ఆమె నటించింది. కొన్ని సినిమాల్లో కూడా వాణిని నటించి మెప్పించింది. సౌందర్య నటించిన శ్వేత నాగు సినిమాలో వాసుకి పాత్ర వాహినికి మంచి పేరు తీసుకొచ్చింది. సినిమాలకంటే ఎక్కువగా సీరియల్స్ తోనే వాహిణి ఆడియన్స్ కు దగ్గరచ్యింది. చివరిగా వాహిని పోలీసువారి హెచ్చరిక, బహిర్భూమి అనే సినిమాల్లో నటించింది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో కొంతకాలంగా ఆమె స్క్రీన్‌కు దూరంగా ఉంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories