బ్లూ శారీలో మెరిసిపోతున్న త్రిష.. చీరకట్టులో కుందవై మెరుపులు.. క్యూట్ స్మైల్ తో చంపేస్తున్న సీనియర్ భామ..

First Published | Mar 30, 2023, 11:21 AM IST

సీనియర్ నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) చీరకట్టులో రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లూ శారీలో రీసెంట్ ఈవెంట్ లో మెరుపులు మెరిపించింది. బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చిన త్రిష ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

తమిళ బ్యూటీ, సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. 
 

ప్రస్తుతం త్రిష నటించిన భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. గతేడాది  సెప్టెంబర్ 30న మొదటి భాగం విడుదలై విజయవంతమైన విషయం తెలిసిందే. ఇక వచ్చే నెలలో రెండో భాగాన్ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. 


నిన్న చెన్నైలో నిర్వహించిన Ponniyin Selvan 2 ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో త్రిష బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చారు. బ్లూ డిజైనర్ శారీలో రాయల్ గా కనిపించింది. సీనియర్ నటి సంప్రదాయ దుస్తుల్లో హుందాగా మెరిసి అందరినీ ఆకట్టుకుంది. 

చీరకట్టులో తమిళ భామ గ్లామర్ మెరుపులూ మెరిపించింది. డీప్ కట్ బ్లౌజ్ లో ఎద అందాలను విందు చేసింది. మెరిసిపోయే చర్మసౌందర్యంతో కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. మరోవైపు త్రిష తన క్యూట్ స్మైల్ తో ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఒక్కరి చూపు కుందవై పైనే పడేలా చేసింది.

పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం నుంచే త్రిష ఇలా సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. సీనియర్ భామ అందాల విందుకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
 

‘పొన్నియిన్ సెల్వన్ 2’ని ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ సంగీతం అందించారు. వచ్చే నెల అంటే ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాతే త్రిష తమిళ స్టార్ విజయ్ దళపతి సరసన ‘లియో’ లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్ షెడ్యూల్ తర్వాత రీసెంట్ చెన్నైలో మరో షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. 

Latest Videos

click me!