వైట్ డ్రెస్ లో తమన్నా కిల్లింగ్ లుక్స్.. మిల్క్ బ్యూటీ మత్తు పోజులకు ఫిదా అయినా రాఖీ ఖన్నా.. పిక్స్

First Published | Jun 20, 2023, 12:48 PM IST

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  స్టన్నింగ్ లుక్స్ లో మెరుస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో తన ఫ్యాషన్ సెన్స్ చూపిస్తూనే.. మత్తు ఫోజులతో మతులు పోగొడుతోంది.
 

స్టార్ బ్యూటీ తమన్నా భాటియా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదనే చెప్పాలి. కొన్నేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తోంది. టాలీవుడ్ ను కొంతకాలం ఊపూపిన ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొడుతోంది.
 

తమన్నా ఇటు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూనే అటు బాలీవుడ్ లోనూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు తమన్నా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరించింది. తన అభిమానులను ఫిదా చేసింది. ఇకపై అలాంటి సినిమాలే వస్తాయని భావించే లోపు పెద్ద షాక్ ఇచ్చింది.
 


సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. ప్రస్తుతం సిరీస్ ల ట్రెండ్ నడుస్తున్నందున తమన్నా కూడా ఊపూపుతోంది. ‘జీ కర్దా’ (Jee Karda)  అనే సిరీస్ లో తమన్నా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సిరీస్ లో ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తో మైండ్ బ్లాక్ చేసింది.
 

రీసెంట్ గా ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తమన్నా బోల్డ్ సీన్లలో నటించడం చూసిన ప్రేక్షకులకు షాక్ కు గురయ్యారు. కెరీర్ ను మలుపుతిప్పుకోవడంలో భాగంగా ఇలా చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా తమన్నా ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది.
 

ప్రస్తుతం ఆ సిరీస్ ను ప్రమోట్ చేసేందుకు నెట్టింట తెగ సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో ఖుషీ అవుతున్నారు. 

Latest Videos

click me!