రెడ్ డ్రెస్ లో మిల్క్ బ్యూటీ మత్తు ఫోజులు.. ‘జైలర్’ కోసం రెచ్చిపోయిన తమన్నా.. స్టన్నింగ్ స్టిల్స్

First Published | Jul 29, 2023, 6:52 PM IST

మిల్క్ బ్యూటీ తమన్నాభాటియా (Tamannaah Bhatia)  గ్లామర్ మెరుపులతో ఇంటర్నెట్ ను హీటెక్కిస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో అందాలతో అదరగొడుతోంది. తాజాగా ‘జైలర్’ ఈవెంట్ కోసం కిర్రాక్ డ్రెస్ లో హాజరై అందరి చూపు తనపైనే పడేలా చేసింది.
 

టాలీవుడ్ లో కొన్నేళ్లపాటు మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా వెలుగొందింది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ లోనూ దుమ్ములేపుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో రూటు మార్చుకొని సరికొత్తగా అలరిస్తోంది. ఇన్నాళ్లు బోల్డ్ కు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రెచ్చిపోయి ఆశ్చర్యపరుస్తోంది. 
 

‘లస్ట్ స్టోరీస్ సీజన్ 2’, ‘జీ కర్దా’ వంటి సిరీస్ ల్లో తమన్నా బోల్డ్ సీన్లలో నటించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి తమన్నా గ్లామర్ షోలో మరింతగా రెచ్చిపోతోంది. తన సినిమా ప్రమోషన్స్ కు అదిరిపోయే అవుట్ ఫిట్లలో హాజరవుతూనే అందాల విందు కూడా చేస్తోంది. 


ప్రస్తుతం తమన్నా చేతిలో ఉన్న రెండు పెద్ద సినిమాలు ‘భోళాశంకర్’, ‘జైలర్’. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది. ఇక రజినీకాంత్ సరసన నటించిన Jailer కూడా ఆగస్టు 10నే విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ ను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. 

రీసెంట్ గా ‘జైలర్’ ఆడియో లాంచ్ ను నిర్వహించారు. ఈవెంట్ కు తమన్నారెడ్ అవుట్ ఫిట్ లో హాజరైంది. బ్యూటీఫుల్ లుక్ తో పాటు గ్లామర్ మెరుపులతో అందరి చూపు తనపైనే పడలేలా చేసింది. అదే అవుట్ ఫిట్ లో క్రేజీగా ఫొటోషూట్ కూడా చేసింది. ఆపిక్స్ ను తాజాగా అభిమానులతో పంచుకుంది. 

కొద్దిరోజులుగా తమన్నా గ్లామర్ షోకు వీలైనటువంటి అవుట్ ఫిట్లు ధరిస్తూ ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది.ఈ క్రమంలో లేటెస్ట్ గా రెడ్ స్పిటెడ్ అవుట్ ఫిట్ లో మెరిసింది. టాప్ గ్లామర్ షోతోపాటు, థైస్ అందాల ప్రదర్శనతో మతులు పోగొట్టింది. మరోవైపు మత్తెక్కించే ఫోజులతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది. 

ఈవెంట్ లో ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ ‘కావాలయ్యా’కు డాన్స్ కూడా చేసి ఆకట్టుకుంది. మొత్తానికి తమన్నా తన సినిమాలను జోర్దార్ గా ప్రమోట్ చేసుకుంటోంది. ఈమేరకు బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది.

ఇక ‘జైలర్’ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ , రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. 

తమన్నా భాటియా ‘జైలర్’, ‘భోళా శంకర్’తో పాటు మరిన్ని చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో  ‘అర్మనమై4’, మలయాళంలో ‘బంద్రా’, హిందీలో ‘వీదా’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. త్వరలో ఇవీ షూటింగ్ పూర్తి చేసుకోనున్నాయి.

Latest Videos

click me!