పెళ్లి ఎప్పుడంటూ తమన్నాకు ప్రశ్న.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన మిల్క్ బ్యూటీ..

First Published | Sep 7, 2023, 11:35 AM IST

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా పెళ్లి ఎప్పుడంటూ తమిళ ఫ్యాన్ ఒకరు ప్రశ్నించారు. దీనిపై మిల్క్ బ్యూటీ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. మరోవైపు ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  ప్రస్తుతం వరుస చిత్రాలు, సిరీస్ లతో అలరిస్తూ వస్తోంది. వెండితెరపై మెరుస్తూనే ఇటు సోషల్ మీడియాలోనూ తెగ కనిపిస్తూ రచ్చ చేస్తోంది. వరుస పోస్టులతో నెట్టింట సందడి చేస్తోంది.  
 

గ్లామర్ షోలో తమన్నా భాటియా ప్రో లెవల్ కు చేరింది. గతంలో పోల్చితే ప్రస్తుతం స్కిన్ షోతో రెచ్చిపోతోంది. వరుస ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ విందుతో మతులు చెడగొడుతోంది. ఊహించని విధంగా దర్శనమిస్తూ కట్టిపడేస్తోంది. కాగా... తమన్నా ఇటీవల చెన్నై పర్యటనలో భాగంగా ఓకార్యక్రమంలో పాల్గొంది. అప్పుడు తన పెళ్లిపై ఓ అభిమాని ప్రశ్నించాడు. ‘మీ పెళ్లి ఎప్పుడు జరగబోతోంది.. తమిళులకు అవకాశం ఉందా? ప్రశ్నించాడు. 


తమన్నా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. ‘ఇంత వరకు మా నాన్న కూడా అలా అడగలేదు’.. ఫన్నీగా బదులిచ్చింది. ఇక తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తమన్నా ట్రెండీ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. గ్లామర్ మెరుపులతో పాటు తన ఫ్యాషన్ సెన్స్ తోనూ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. మత్తెక్కించే ఫోజులతో మైమరిపిస్తోంది.
 

తాజాగా తమన్నా డెనీమ్ జీన్స్ వేర్స్ లో దర్శనమిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో మిల్క్ బ్యూటీ కొంటెగా ఫోజులిచ్చింది. కవ్వింపు చర్యలతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంది. క్యూట్ లుక్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ స్టార్ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

ప్రస్తుతం వెండితెరపై, ఓటీటీల్లో వరుసగా సందడి చేస్తూనే ఉంది.  రీసెంట్ గా ‘జైలర్’లో స్పెషల్ అపీయరెన్స్ తో దుమ్ములేపింది. అంతకు ముందు మాత్రం వెబ్ సిరీస్ ల్లో బోల్డ్ పెర్ఫామెన్స్ తో సెన్సేషన్ గా మారింది. 

‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ వంటి సిరీస్ ల్లో ఏకంగా బెడ్ సీన్లలో నటించి ఆశ్చర్యపరిచింది. ఇక రీసెంట్ గా మాత్రం ‘ఆఖ్రీ సచ్’ అనే సిరీస్ తోనూ అలరిస్తోంది. ప్రస్తుతం ‘బంద్రా’, ‘ఆరణ్మనై 4’, ‘వేడా’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. 

Latest Videos

click me!