వెబ్ సిరీస్ కోసం తెగించిన తమన్నా.. ఫస్ట్ టైం బోల్డ్ సీన్లలో మిల్క్ బ్యూటీ.. కొత్త సన్నీ లియోన్ అంటూ ట్రోల్స్..

First Published | Jun 15, 2023, 6:44 PM IST

తొలిసారిగా తమన్నా భాటియా బోల్డ్ సీన్లలో నటించి షాక్ కి గురిచేసింది. మిల్క్ బ్యూటీ నటించిన హిందీ వెబ్ సిరీస్ ‘జీ కర్దా’ ఈరోజు విడుదలైంది. ఇందులో తమన్నా హద్దులు మీరి నటించింది. దీంతో నెటిజన్లు ట్రోల్స్  చేస్తున్నారు. 
 

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  కొద్దికాలంగా బాలీవుడ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో ఊపూపిన ఈ ముద్దుగుమ్మ ఇటు దక్షిణాది చిత్రాలతో పాటు అటు నార్త్ లోనూ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తోంది. 
 

ఇదిలా ఉంటే.. మొన్నటి వరకు తమన్నా భాటియా తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటించింది. ‘బబ్లీ బౌన్సర్’ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలోనూ నటించి ఆకట్టుకుంది. అయితే మునుపెన్నడూ లేని కోణాన్ని చూపించింది. మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా తాజాగా హిందీలో విడుదలైన వెబ్ సిరీస్ లో బోల్డ్ సీన్లలో రెచ్చిపోయింది. 
 


బాలీవుడ్ డైరెక్టర్ అరునిమా శర్మ దర్శకత్వంలో ఓటీటీ వేదిక ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ ‘జీ కర్దా’లో తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, సిరీస్ చూసిన ఆడియెన్స్ కు తమన్నా తెగింపు చూసి షాక్ తగిలింది. 
 

సిరీస్ లో నటుడు ఆశీమ్ గులాటితో కలిసి హద్దులు మీరి రొమాన్స్ చేసింది. ఏకంగా టాప్ తీసేసి సె***క్స్  సన్నివేశాల్లో నటించి షాక్ కు గురి చేసింది. గతంలో ఎప్పుడూ ఈ ముద్దుగుమ్మ ఇలా సన్నివేశాల్లో నటించింది లేదు. కాస్తా రొమాన్స్ లో రెచ్చిపోయిందే గానీ  ఈ స్థాయిలో బోల్డ్ సీన్లలో నటించలేదు. 

Jee Karda వెబ్ సిరీస్ కోసం తమన్నా తెగించడంతో అభిమానులు, నెటిజన్లు కాస్తా హార్ట్ అయ్యారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన మిల్క్ బ్యూటీని స్క్రీన్ పై అలా చూసే సరికి కాస్తా అస్పెట్ అయ్యారు. ఫిల్మ్ క్రిటిక్ విశ్వజిత్ పాటిల్ ఇండియాకు కొత్త సన్నీలియోన్ దొరికిందంటూ కామెంట్ చేశారు. నెటిజన్లు కూడా తమన్న తీసుకున్న నిర్ణయాన్ని ట్రోల్ చేస్తున్నారు.  
 

కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్  ను ఇలాంటి బోల్డ్ పెర్ఫామెన్స్ తో కొనసాగించాలనుకుందా అంటూ ఆడేసుకుంటున్నారు. త్వరలో రాబోతున్న ‘లస్ట్ స్టోరీస్ 2’లో ఇంకెలా రెచ్చిపోతుందోనని అంటున్నారు. ఏదేమైనా తమన్నా తీసుకున్న నిర్ణయం చాలా మేరకు అప్సెట్ చేసిందనే అంటున్నారు. ఇక తెలుగులో తమన్నా మెగాస్టార్ సరసన ‘భోళా శంకర్’లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!