అమర్ దీప్ నాకు తమ్ముడు లాంటోండు.. కూతురికి హీరోయిన్ గా ఛాన్స్ రావడంపై సురేఖ వాణి కామెంట్స్

First Published | Feb 1, 2024, 4:19 PM IST

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. 

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. 

కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ ట్రోలింగ్ కి గురవుతుంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం చూశాం. తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


సుప్రీత తరచుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ యువతని అట్రాక్ట్ చేస్తోంది. కళ్ళు చెదిరే సొగసుతో సుప్రీత మాయ చేస్తోంది. సుప్రీతా ఘాటైన ఫోజులు చూసి ఆమె హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది అని అంతా భావించారు. సురేఖ వాణి కూడా తన కుమార్తె ని సినిమాల్లోకి తీసుకువచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. 

ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలించాయి. సుప్రీతా క్రేజీ ఆఫర్ కొట్టేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ హీరోగా ఒక చిత్రం ప్రారంభం అయింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సుప్రీతని ఎంపిక చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. 

ఈ కార్యక్రమానికి సురేఖ వాణి కూడా హాజరయ్యారు. సురేఖ వాణి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అమర్ దీప్ తనకి తమ్ముడు లాంటోండు అని సురేఖ వాణి పేర్కొంది. 

అలాగే తన కుమార్తెని ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి చాలా భయపడినట్లు సురేఖ వాణి పేర్కొంది. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి అందరి తల్లుల లాగే తాను కూడా భయపడినట్లు తెలిపింది. అయితే ఇంత మంచి టీమ్ దొరికినందువల్ల తాను ధైర్యంగా తన కుమార్తెని వారి చేతుల్లో పెడుతున్నట్లు సుప్రీత పేర్కొంది. 

Latest Videos

click me!