Pooja Hegde
పూజా హెగ్డేకి గత కొన్నేళ్లుగా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. డీజే తర్వాత సౌత్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే అనేక విజయాలు సొంతం చేసుకుంది. డీజే, అరవింద సమేత, మహర్షి, గడ్డలకొండ గణేష్, మహర్షి, అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కాయి.
ఆ తర్వాత పూజా హెగ్డేకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య ఇలా వరుసగా ప్లాపులు ఎదురయ్యాయి. హిందీలో సల్మాన్ తో నటించిన కిసీకి భాయ్ కిసీకి జాన్ చిత్రం కూడా ఆశించిన ఫలితం రాలేదు. దీనితో పూజా హెగ్డేకి ఒక్కసారిగా దారులన్నీ మూసుకుపోయాయి. చేతిలో ఉన్న ఛాన్సులు కూడా మిస్ అయ్యాయి.
ముందుగా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పూజా హెగ్డేని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం నుంచి కూడా పూజా హెగ్డే తప్పుకుంది. అలాగే మరికొన్ని అవకాశాలు కూడా చేజారాయి.
అయితే పూజా హెగ్డే మరో క్రేజీ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయిధరమ్ తేజ్.సంపత్ నంది కాంబినేషన్ లో గంజా శంకర్ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ అని ముందుగా వార్తలు వచ్చాయి.
అయితే అంతా ఫైనల్ అయ్యాక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించడం ఇష్టం లేక ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి తప్పుకోవడం వెనుక ఒక కారణం ఉందని అంటున్నారు. ఈ మూవీలో హీరోయిన్ ఎక్కువ సమయంలో జైలులో ఖైదీగా కనిపించాలట. అది కూడా వైట్ శారీలో డీ గ్లామర్ లో కనిపించాల్సి ఉంటుంది అని అంటున్నారు.
గ్లామర్ పాత్రలు ఇష్టపడే పూజా హెగ్డే ఇలా డీ గ్లామర్ రోల్ లో నటించడం నచ్చలేదట. అందుకే ముందుగానే గంజా శంకర్ చిత్రం నుంచి ఆమె తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.