Anchor Rashmi: సవతితల్లిలా చూస్తున్నారు, అందుకే విరక్తి చెందా.. సంచలన విషయాలు బయటపెట్టిన యాంకర్‌ రష్మి

Published : Jan 10, 2026, 07:00 PM IST

యాంకర్‌ రష్మి ప్రారంభంలో సినిమాలు చేసింది. ఆ తర్వాత క్రమంగా తగ్గించింది షోస్‌కే పరిమితమయ్యింది. అయితే సినిమాలు మానేయడానికి కారణం ఏంటో చెప్పింది. సవతితల్లిలా చూస్తున్నట్టు పేర్కొంది. 

PREV
15
జబర్దస్త్ కామెడీతో రష్మి గౌతమ్‌ కెరీర్ బిగ్‌ టర్న్

రష్మి గౌతమ్‌ బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది. ఆమెకి `జబర్దస్త్` కామెడీ షో లైఫ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 13ఏళ్లుగా ఈ షోకి యాంకర్‌గా చేస్తుంది రష్మి. ఒక షో ఇన్నేళ్లు రన్‌ కావడం ఓ విశేషమైతే, దానికి యాంకర్‌ కూడా ఒక్కరే కొనసాగడం విశేషం. కొంత కాలం అనసూయ కూడా యాంకరింగ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆమె రెండేళ్ల క్రితమే దీన్నుంచి తప్పుకుంది. దీంతో రష్మి గౌతమ్‌ ఇప్పుడు సింగిల్‌గా రెండు ఎపిసోడ్లని రన్‌ చేస్తోంది. 

25
సీరియల్స్, సినిమాలు చేసిన రష్మి గౌతమ్‌

యాంకర్‌ రష్మి హీరోయిన్‌ కావాలని సినిమాల్లోకి వచ్చింది. ప్రారంభంలో ఆమె కొన్ని సినిమాలు చేసింది. సీరియల్స్ కూడా చేసింది. కానీ క్యారెక్టర్స్, చెల్లి పాత్రలు చేసింది. నటిగా `హోలీ`, `కరెంట్‌`, `ఎవరైనా ఎపుడైనా`, `గణేష్‌`, `బిందాస్‌`, `ప్రస్థానం`, `గురు`, `గుంటూరు టాకీస్‌`, `అంతం` వంటి చిత్రాల్లో నటించింది. అయితే గుంటూరు టాకీస్‌ రష్మికి మంచి బ్రేక్‌ ఇచ్చింది. `అంతం`లో హీరోయిన్‌గానే చేసింది. `బొమ్మ బ్లాక్‌ బస్టర్‌` మూవీలోనూ హీరోయిన్‌గా చేసింది.

35
చెల్లి పాత్ర చేస్తే చెల్లిగానే ముద్ర వేస్తారు- రష్మి గౌతమ్‌

అయితే ప్రారంభంలో రష్మి క్యారెక్టర్స్ చేయడం వల్ల తాను ఫేస్‌ చేసిన స్ట్రగుల్స్ ని చెప్పింది. చెల్లి పాత్రలు చేయడంతో అంతా చెల్లి పాత్రలకే అడిగారని, చెల్లిగానే గుర్తిస్తున్నారని తెలిపింది. తాను చేసిన పాత్ర పేరు కూడా వాళ్లకి గుర్తుండదు, ఫలానా సినిమాలో చెల్లిగా చేశారు, ఫ్రెండ్‌గా చేశారు, ఈ పాత్ర చేశారు అంటుంటారు, తప్పితే కనీసం పేరు కూడా గుర్తుండదు అని వెల్లడించింది. సెట్‌లో హీరోలు, హీరోయిన్లకి ట్రీట్‌ మెంట్‌ వేరేలా ఉంటుంది. మాలాంటి ఇతర పాత్రలు చేసేవారికి మరోలా ట్రీట్‌ చేస్తుంటారని వాపోయింది.

45
సవతి తల్లి ట్రీట్‌మెంట్‌ భరించలేకే వదిలేశా- రష్మి

ఒక రకంతా తాను సవతితల్లి ట్రీట్‌ మెంట్‌ని ఫేస్‌ చేసినట్టు తెలిపింది. అది చూసి చూసి విసిగిపోయి, విరక్తి చెందినట్టు వెల్లడించింది రష్మి. అందుకే అలాంటి పాత్రలు చేయాలనుకోవడం లేదని తెలిపింది. ఒక్కసారి చెల్లి పాత్రలు చేస్తే అన్నీ చెల్లి పాత్రలే వస్తాయని, అవే చేస్తారనే ముద్ర వేస్తారని చెప్పింది రష్మి. అందుకే తాను సినిమాలకు దూరమయినట్టు పేర్కొంది.  ఈ మధ్య రష్మి సినిమాలు చేయడం లేదు. కేవలం జబర్దస్త్ కామెడీ షోకే పరిమితమయ్యింది.

55
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో రష్మి బిజీ

చివరగా ఆమె `భోళా శంకర్‌` చిత్రంలో ఓ పాటలో మెరిసింది. ఇందులో చిరంజీవితో కలిసి ఆమె డాన్స్ వేయడం విశేషం. స్పెషల్‌గా ఉండే ఈ పాటలో మెగాస్టార్‌తో స్టెప్పులేసి మెప్పించింది రష్మి. ఇక రష్మి ప్రారంభంలో సీరియల్స్ కూడా చేసింది. `యువ` అనే సీరియల్‌లో ఆమె మెరిసింది. ఇందులో రాజమౌళి కి  లవర్‌గా కనిపించడం విశేషం. అలాగే `లవ్‌` అనే మరో సీరియల్‌లో కూడా నటించింది. ఆ తర్వాత షోస్‌ వైపు టర్న్ తీసుకుంది. `జబర్దస్త్` షోతోపాటు `ఢీ`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` వంటి షోస్‌ చేసింది. ఇప్పుడు `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోస్‌కే పరిమితమయ్యింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories