ఎట్టకేలకు సుడిగాలి సుధీర్ కి పెళ్లి?  అమ్మాయి ఎవరంటే?

Published : Apr 16, 2023, 09:23 PM ISTUpdated : Apr 16, 2023, 09:25 PM IST

సుడిగాలి సుధీర్ వివాహం ఎవర్ గ్రీన్ టాపిక్. తాజాగా మరోసారి ఆయన వివాహం తెరపైకి వచ్చింది.   

PREV
15
ఎట్టకేలకు సుడిగాలి సుధీర్ కి పెళ్లి?  అమ్మాయి ఎవరంటే?


జబర్దస్త్ షో వేదికగా ఎదిగిన సుడిగాలి సుధీర్ స్టార్ అయ్యారు. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నారు. కాగా సుధీర్ కి వివాహ వయసు దాటిపోయి చాలా కాలం అవుతుంది. ఆయన తోటి కమెడియన్స్ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నారు. సుధీర్ మాత్రం పెళ్లి మాట ఎత్తడం లేదు. సుధీర్ తమ్ముడికి కూడా వివాహం అయినట్లు సమాచారం 
 

25
Sudigali Sudheer

కాగా యాంకర్ రష్మీ గౌతమ్ ని సుధీర్ ప్రేమిస్తున్నాడనే ప్రచారం ఉంది. వీరిద్దరూ బుల్లితెర మీద నాన్ స్టాప్ రొమాన్స్ పంచిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. సుధీర్-రష్మీలను మీ మధ్య ఉన్న బంధం ఏంటని అడిగితే స్పష్టమైన సమాచారం ఇవ్వరు. ఒక ప్రక్క ఖండిస్తూనే... మరో ప్రక్క హింట్స్ ఇస్తూ ఉంటారు. ఆ మధ్య రష్మీ... మా మధ్య సంబంధం ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు. 

35

అయితే హైప్ కోసమే వీరు ప్రేమికులుగా నటించారు. రష్మీ-సుధీర్ ఫ్రెండ్స్ మాత్రమే అని సన్నిహితులు అంటుంటారు. తాజాగా సుధీర్ పెళ్ళికి సిద్దమయ్యారన్న వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. అమ్మాయి ఎవరంటే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం సుధీర్ బంధువుల అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడట. వరసకు మరదలు అవుతుందట. 

45

ఈ మేరకు ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. గతంలో కూడా పలుమార్లు సుధీర్ పెళ్లి వార్తలు హల్చల్ చేశాయి. దీంతో నమ్మొచ్చా లేదా అనే సందిగ్ధత నెలకొంది.

55

మరోవైపు సుధీర్ హీరోగా ఫస్ట్ హిట్ కొట్టాడు. గత ఏడాది ఆయన హీరోగా నటించిన గాలోడు చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో ఆయనకు హీరోగా ఆఫర్స్ వస్తున్నాయి. కాలింగ్ సహస్ర టైటిల్ తో సుధీర్ ఓ మూవీ చేస్తున్నారు. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. త్వరలో ప్రకటించనున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories