స్నేహ కిల్లింగ్ లుక్స్.. ఎర్ర చీరలో ఆమె అందం చూశారా, స్టన్నింగ్ అంతే..

First Published Jan 20, 2022, 9:17 PM IST

నటి సౌందర్య తర్వాత హోమ్లీ క్వీన్ గా స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది.

నటి సౌందర్య తర్వాత హోమ్లీ క్వీన్ గా స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. 

ఎక్కువగా ఫ్యామిలీ,  చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పించింది స్నేహ.  వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది. ఆ టైంలో అలాంటి చిత్రాలకు స్నేహ మాత్రమే దర్శకుల ఛాయిస్. ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నని స్నేహ 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తోంది. కాకపోతే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం లేదు. 

స్నేహ, ప్రసన్న దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. స్నేహ తెలుగులో చివరగా వినయ విధేయ రామ చిత్రంలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో స్నేహ రాంచరణ్ కు వదిన పాత్రలో నటించి మెప్పించింది. తన కెరీర్ లో స్నేహ ఎప్పుడూ హద్దులు దాటేలా గ్లామర్ షో చేయలేదు. 

సోషల్ మీడియాలో స్నేహ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వివాహం తర్వాత కూడా స్నేహ గ్లామర్ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ స్నేహ అదే ఫిట్ నెస్ తో మెప్పిస్తోంది. స్నేహ తాను అందాల దేవత అని మరోసారి నిరూపించుకుంది. 

రెడ్ శారీలో స్నేహ ఇచ్చిన ఫోజులు కేక పెట్టించే విధంగా ఉన్నాయి. తన గ్లామర్ తో శారీ లో స్నేహ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది అనే చెప్పాలి. ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోలేని విధంగా స్నేహ తన అందంతో కట్టిపడేస్తుంది. 

39 ఏళ్ళ వయసులో కూడా స్నేహ ఈ రేంజ్ ఫిట్ నెస్ మైంటైన్ చేయడం అద్భుతమే. మంచి రోల్స్ పడితే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రాణించాలని స్నేహ భావిస్తోంది. 

click me!