వయస్సు పెరుగుతున్నా తరగని అందం.. చుడీదార్ లో హోమ్లీ బ్యూటీ స్నేహ అదిరిపోయే లుక్స్..

First Published | Jun 25, 2023, 12:17 PM IST

హోమ్లీ బ్యూటీ స్నేహ రోజురోజుకు మరింత బ్యూటీఫుల్ గా మెరుస్తోంది. వయస్సు పెరుగుతున్నా చెక్కు చెదరని అందంతో కట్టిపడేస్తోంది. వరుస ఫొటోషూట్లతో ఫ్యాన్స్ ను మరింతగా ఆకట్టుకుంటోంది. 
 

ముంబైకి చెందని నటి స్నేహ సౌత్ ఆడియెన్స్ కు ఎంత దగ్గరైందో తెలిసిందే. కొన్నాళ్ల పాటు తెలుగు, తమిళంలో వరుస చిత్రాలతో ఊపూపింది. స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో తనదైన ముంద్ర వేసుకున్నారు. ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. 
 

ప్రస్తుతం స్నేహ సెకండ్ ఇన్సింగ్స్ ను కొనసాగిస్తున్నారు. పదేళ్ల కిందనే తమిళ నటుడు ప్రసన్నను పెళ్లిచేసుకున్నస్నేహ కెరీర్ ను మాత్రం వదులుకోలేదు. అటు మ్యారేజ్ లైఫ్ ను లీడ్ చేస్తూనే ఇటు సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ గా కాకుండా కీలక పాత్రల్లో నటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 
 


ఇప్పటికీ స్నేహ వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తోంది. ఈ ఏడాది మలయాళ చిత్రం ‘క్రిస్టోఫర్’లో నటించింది. ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యింది. దాంతర్వాత నెక్ట్స్ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇదిలా ఉంటే.. స్నేహ సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తూనే వస్తోంది.

వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ వేర్స్ లో దర్శనమిస్తూ  బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంటోంది. చెక్కు చెదరని అందంతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. తన అందంతో ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ మాత్రమే అనిపిస్తోంది. ఇక తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేసింది. 
 

తాజాగా స్నేహ పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. చుడీదార్ లో యంగ్ హీరోయిన్ గా కనిపిస్తోంది. నిండు దుస్తుల్లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. అదిరిపోయే ఫోజులిస్తూ కట్టిపడేసింది. బ్యూటీఫుల్ స్మైల్ తో హృదయాలను కొల్లగొట్టింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్ చేస్తున్నారు. 
 

కెరీర్ లో మరిన్ని ప్రాజెక్ట్స్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోందీ హోమ్లీ బ్యూటీ. ఇందుకోసం ఇలా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇక తెలుగులో స్నేహ చివరిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’లో అలరించింది. నెక్ట్స్ ఎలాంటి సినిమాతో వస్తుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 
 

Latest Videos

click me!