ట్రెడిషనల్ వేర్ లో ‘స్పై’ హీరోయిన్ బ్యూటీఫుల్ లుక్స్.. క్యూట్ ఫోజులతో కట్టిపడేస్తున్న ఐశ్వర్య మీనన్

First Published | Jun 25, 2023, 11:05 AM IST

తమిళ హీరోయిన్ ఐశ్వర్య మీనన్ (Iswarya Menon)  తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. ‘స్పై’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
 

కోలీవుడ్ లో వరుస చిత్రాలతో యంగ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్ మంచి గుర్తింపు దక్కించుకుంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గ్లామర్ పరంగా ఈ ముద్దుగుమ్మ  మంచి మార్కులు దక్కించుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటూ వస్తోంది.
 

ఇన్నాళ్లు కోలీవుడ్ లో సందడి చేసిన ఐశ్వర్య మీనన్ ఇక తెలుగు ప్రేక్షకులనూ పలకరించబోతోంది. టాలీవుడ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha)  సరసన ‘స్పై’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. 
 


Spy  చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఐశ్వర్య మీనన్ వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలో కట్టిపడేస్తోంది. తెలుగు వారిని పలకరించబోతుండటంతో సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిస్తూ వస్తోంది. బ్యూటీఫుల్ లుక్ లో కట్టిపడేస్తోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ చుడీదార్ లో మెరిసింది. పూలపూల డ్రెస్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. క్యూట్ ఫోజులతో కట్టిపడేసింది. తన స్మైల్ తో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసింది. అట్రాక్టివ్ లుక్ లో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంది. 
 

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ తొలిచిత్రంతోనే భారీ హిట్ ను అందుకునేలా కనిపిస్తోంది. జూన్ 29న విడుదల కాబోతున్న స్పై చిత్రం ఇప్పటికే మంచి అంచనాలను క్రియేట్ చేసింది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూ మంచి రెస్పాన్స్ దక్కింది. 
 

దీంతో ఐశ్వర్య ఎంట్రీ అదిరిపోనుందని అర్థమవుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్లు మంచి ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఐశ్వర్య పెర్ఫామెన్స్ నచ్చితే ఇక్కడే మరిన్ని అవకాశాలు అందుకుంటుందని అంటున్నారు. 
 

Latest Videos

click me!