బ్లాక్ ఫిట్ లో విశ్వక్ సేన్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్.. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ కు మైండ్ బ్లాకే..

First Published | Feb 6, 2023, 10:07 AM IST

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి (Simran Choudhary) స్టన్నింగ్ ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది. అదిరిపోయే స్టిల్స్ తో అందాల విందు చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 
 

నెట్టింట గ్లామర్ షోతో మతులు పోగొడుతోంది యంగ్ హీరోయిన్  సిమ్రాన్ చౌదరి. ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తోంది. వరుసగా అవకాశాలు అందుకుంటూ క్రేజ్ దక్కించుకుంటున్నారు.
 

మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ కనిపిస్తూ అదిరిపోయే పొటోషూట్లతో అదరగొడుతోందీ బ్యూటీ. కుర్ర భామ అందాల విందుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ ఉన్నాయి.
 


బ్లాక్ అవుట్ ఫిట్ లో స్లిమ్ ఫిట్ అందాలతో అదరగొట్టింది సిమ్రాన్ చౌదరి. కుర్ర గుండెలు పేలిపోయేలా గ్లామర్ షో చేస్తూ..  నెట్టింట దుమారం రేపింది. స్టన్నింగ్ పోజులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. లేటెస్ట్ పిక్స్ తో కట్టిపడేసింది.
 

సినిమాలతోనే కాకుండా ఇలా సోషల్ మీడియాలోనూ గ్లామర్ మెరుపులతో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు సినిమాల్లో వరుసగా అవకాశాలను అందుకుంటున్న ఈ భామ.. మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో కథ నచ్చితే ఎలాంటి రోల్స్ లోనైనా నటించేందుకు సిద్ధమేనంటూ ఇలా ఫొటోషూట్లతో సూచిస్తున్నట్టు తెలుస్తోంది.  

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) సరసన ‘ఈ నగరానికి ఏమైంది’   చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాల్లో అవకాశాలను అందుకున్నారు. టాలీవుడ్ యంగ్ స్టార్స్ సరసన నటిస్తూ క్రేజ్ దక్కించుకున్నారు. 

తెలుగులో సిమ్రాన్ చౌదరి ‘భోంబాట్’,‘చెక్’, ‘పాగల్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు. కానీ స్టార్ స్టేటస్ ను దక్కించుకోలేకపోయింది. ఒక్క హిట్ పడితే ఈ బ్యూటీకూడా టాలీవుడ్ లో దూసుకుపోయే అవకాశం ఉందంటున్నారు. గతేడాది ‘సెహరి’చిత్రంతో అలరించింది.

Latest Videos

click me!