అనసూయ తాజాగా రంగమార్తాండ చిత్రంలో నటించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం లాంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. అనసూయ కూడా కీలక పాత్రలో మెరిసింది. ఉగాది కానుకగా బుధవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనసూయ రంగమార్తాండ ప్రెస్ మీట్ లో రెడ్ శారీలో మెరిసింది.