సంఘవి కెరీర్ నాశనం అయింది ఆ డైరెక్టర్ వల్లేనా.. అతడితో ప్రేమ, పెళ్లి, విడాకులు.. చివరికి..

First Published | Oct 4, 2023, 8:02 PM IST

సీనియర్ హీరోయిన్ సంఘవి పేరు చెప్పగానే తెలుగులో సరదా బుల్లోడు, సూర్య వంశం, సమరసింహారెడ్డి, సీతారామరాజు, సందడే సందడి లాంటి క్రేజీ చిత్రాలు గుర్తుకు వస్తాయి. 

సీనియర్ హీరోయిన్ సంఘవి పేరు చెప్పగానే తెలుగులో సరదా బుల్లోడు, సూర్య వంశం, సమరసింహారెడ్డి, సీతారామరాజు, సందడే సందడి లాంటి క్రేజీ చిత్రాలు గుర్తుకు వస్తాయి. 1993లో అజిత్ సరసన అమరావతి చిత్రంలో తొలిసారి సంఘవి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

అయితే తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో టాప్ హీరోలతో అవకాశాలు వస్తున్న తరుణంలో ఆమె చేసిన పొరపాటే కెరీర్ కి శాపంగా మారింది.  విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . దానికి కారణం నేడు సంఘవి పుట్టిన రోజు. 


సంఘవి 90 దశకంలో కమల్ హాసన్, అజిత్, విజయ్, రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశం అందుకుంది. దళపతి విజయ్ సరసన సంఘవి మూడు చిత్రాల్లో నటించింది. ఇదే కాంబినేషన్ లో నాల్గవ చిత్రం కూడా సెట్ అయింది. అయితే ఆ సమయంలో విజయ్, సంఘవి మధ్య లవ్ అఫైర్స్ అంటూ రూమర్స్ వచ్చాయి. 

విజయ్ తండ్రి చంద్రశేఖర్ దర్శకుడు కావడంతో.. తన కొడుకుతో సంఘవి ప్రేమలో ఉందనే కోపంతో ఆయన ఆ చిత్రాన్ని మధ్యలోనే ఆపేశారు. అలా ఆ చిత్రం అటకెక్కింది. మూవీ మొఘల్ రామాయయుడు నిర్మించిన తాజ్ మహల్ చిత్రంలో సంఘవి సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఆమె సురేష్ ప్రొడక్షన్స్ లో దాదాపు అరడజను చిత్రాలు చేసింది. రాజశేఖర్ శివయ్య చిత్రంలో నటిస్తున్న సమయంలో ఆ చిత్ర దర్శకుడు సురేష్ వర్మతో సంఘవి ప్రేమలో పడింది. ఆ అడుగే ఆమె కెరీర్ కి శాపంగా మారింది. 

సురేష్ వర్మని సంఘవి 2000 లో వివాహం చేసుకుంది. ఈ పెళ్లి తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేనప్పటికీ సంఘవి ఇంట్లో నుంచి వచ్చేసి అతడిని వివాహం చేసుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో సురేష్ వర్మని పెళ్లి చేసుకోవడంతో సంఘవి డౌన్ ఫాల్ ప్రారంభం అయింది. కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా సంఘవికి, సురేష్ వర్మకి విభేదాలు మొదలయ్యాయి. 

సురేష్ వర్మకి కూడా అవకాశాలు లేకపోవడంతో ఇంట్లోనే ఉండేవారట. కానీ షూటింగ్ కి వెళ్లి వేస్తున్న సంఘవిపై సురేష్ వర్మ అనుమానం పెంచుకున్నాడట. దీనితో భార్య భర్తల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరడంతో వీరిద్దరూ ఊహించని విధంగా విడిపోయారు. ఇక సంఘవి 2016లో సంఘవి సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత ఎన్ వెంకటేష్ ని రెండవ వివాహం చేసుకుంది. 

Latest Videos

click me!