రెండ్రోజుల్లో ‘శాకుంతలం’ రిలీజ్.. తన హెల్త్ పై అప్డేట్ ఇచ్చిన సమంత.. ఏమైందంటే?

First Published | Apr 12, 2023, 7:13 PM IST

స్టార్ హీరోయిన్ సమంత ‘శాకుంతలం’ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా సామ్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు స్వయంగా వెల్లడించారు.
 

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘శాకుంతలం’ (Shaakuntalam). క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. నీలిమా గుణ నిర్మించారు.  దేవ్ మోహన్ - సామ్ జోడీగా నటించారు. రెండ్రోజుల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.
 

సమంత అభిమానులు ‘శాకుంతలం’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ సినిమాపై హైప్ ను పెంచేశాయి. మరోవైపు ప్రచార కార్యక్రమాల్లో మొన్నటి వరకు సమంత సందడి చేశారు. సినిమా విషయాలను పంచుకున్నారు.  
 


తాజాగా ఫ్యాన్స్ కు సమంత షాకింగ్ న్యూస్ చెప్పారు.  తనకు ఆరోగ్యం బాగా లేదని వెల్లడించారు.  ఈమేరకు ట్వీట్ చేస్తూ తన హెల్త్ పై అప్డేట్ అందించారు సామ్. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ అనారోగ్యానికి గురవడంతో చింతిస్తున్నారు. 
 

సమంత ట్వీట్ చేస్తూ.. ‘ఈ వారం అంతా నా సినిమాను ప్రమోట్ చేస్తూ మీ ప్రేమలో మునిగితేలుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. హెవీ షెడ్యూల్స్, అలాగే ప్రమోషన్స్ కార్యక్రమాలు ఉండటంతో దురదృష్టవశాత్తూ నేను జ్వరంతో బాధపడుతున్నాను. నా స్వరాన్ని కూడా కోల్పోయాను.
 

ఇందుకు చింతిస్తున్నాను. ఈరోజు సాయంత్రం ఎంఎల్ఆర్ఐటీలో జరగనున్న అన్యువల్ డే ఈవెంట్  కు హాజరు కాలేకపోతున్నాను. మీ అందరీని మిస్ అవుతున్నాను.’ అంటూ సామ్ ట్వీట్ చేశారు. దీంతో నెట్టింట వైరల్ గా మారింది.  సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
 

ఇక ‘యశోద’ రిలీజ్ సమయంలోనూ సమంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. వమోసైటిస్ వ్యాధితో నెలలపాటు చికిత్స తీసుకున్నారు. ఇటీవలె కోలుకున్న సమంత కాస్తా అనారోగ్యానికి గురవడం ఫ్యాన్స్ ను బాధిస్తోంది. సామ్ ఆరోగ్యం కుదుట పడాలని ఆశిస్తున్నారు. సమంత ‘ఖుషి’, ‘సిటడెల్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
 

Latest Videos

click me!