వైట్ చుడీదార్ లో సమంత బ్యూటీఫుల్ లుక్.. షోల్డర్ గ్లామర్ తోనే మైమరిపిస్తున్న స్టార్ బ్యూటీ

First Published | Mar 28, 2023, 1:32 PM IST

స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా సామ్ బ్యూటీఫుల్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
 

స్టార్ హీరోయిన్ సమంత (Samantha)   ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. చైతూతో విడాకుల తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్ ‘పుష్ప : ది రైజ్’తో రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ములేపుతోంది. 

చివరిగా ‘యశోద’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘శాకుంతలం’ Shaakuntalam  తో అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం వచ్చే నెల రెండో వారంలో విడుదల కానుండటంతో.. చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు.
 


ఈ క్రమంలో సమంత సైతం ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టులతో ఆకట్టుకుంటున్నారు. మరోవైపు స్టన్నింగ్ ఫొటోషూట్లతోనూ ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ లుక్ లో మెరుస్తూనే గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. స్టార్ హీరోయిన్ అందాల విందుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

రీసెంట్ గా ట్రాన్స్ ఫరెంట్ శారీలో మెరిసిన సామ్.. తాజాగా వైట్ స్లీవ్ లెస్ చుడీదార్ లో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ లుక్ లో స్టార్ హీరోయిన్ అందాల విందు చేసింది. మత్తుపోజులతో మైమరిపించింది. మత్తెక్కించే చూపులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. 
 

కొద్దిరోజుల కింది వరకు వయోసైటిస్ వ్యాధితో బాధపడ్డ సమంత... ఇప్పుడు కోలుకున్నట్టు తెలుస్తోంది.  దీంతో ఇటు సోషల్ మీడియాలో.. అటు తన ఓకే చెప్పిన ప్రాజెక్ట్స్ పనుల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ప్రస్తుతం ‘శాకుంతలం’ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించారు.
 

లేటెస్ట్ గా ఫొటోలను పంచుకుంటూ ఏప్రిల్ 14న ‘శాకుంతలం’ చిత్రం విడుదల కాబోతుందని అభిమానులు, అడియెన్స్ కు సూచించింది. ఈ చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియన్ ఫిల్మ్ గా ఐదు భాషల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది. 
 

Latest Videos

click me!