నార్త్ బ్యూటీ, క్యూట్ హీరోయిన్ సలోని అశ్వాని తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచిత్రం. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ తొలుత బాలీవుడ్ చిత్రం ‘దిల్ పర్దేశీ హో గయా’ చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. 2003లో ఈ మూవీ విడుదలైంది. అప్పటి నుంచి 13 ఏళ్లపాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది.