అందరూ అనుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ అలాంటి వాడు కాదు... సమంత షాకింగ్ కామెంట్స్ 

Published : Aug 25, 2023, 09:35 PM IST

హీరోయిన్ సమంత హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన క్యారెక్టర్ ని ఉద్దేశిస్తూ సమంత ఇలా అన్నారు.   

PREV
16
అందరూ అనుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ అలాంటి వాడు కాదు... సమంత షాకింగ్ కామెంట్స్ 

సమంత-విజయ్ దేవరకొండ మరోసారి జతకట్టారు. గతంలో మహానటి మూవీలో జంటగా నటించిన విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఖుషి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. సెప్టెంబర్ 1న విడుదల కానుంది. 

 

26

ఈ చిత్ర ప్రమోషన్లో విజయ్ దేవరకొండ-సమంత కలిసి పాల్గొన్నారు. హైదరాబాద్ వేదికగా మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఇది భారీగా సక్సెస్ అయ్యింది. వేదిక మీద సమంత, విజయ్ దేవరకొండ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పడింది. చెప్పాలంటే కొంచెం ఓవర్ అయ్యిందన్న మాట వినిపించింది. 

36

విజయ్ దేవరకొండ చొక్కా విప్పేయగా సమంత స్లీవ్ లెస్ చోళీలో కొంచెం హాట్ గా కనిపించింది. సమంతను ఎత్తుకొని విజయ్ దేవరకొండ గాల్లో తిప్పాడు. అయితే ఇదంతా సినిమాకు ప్రచారం కల్పించే భాగంలోనే చేశారు. సమంత అమెరికా వెళ్లాల్సి ఉండగా కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంది. ప్రస్తుతం ఆమె అమెరికాలోనే ఉంది.

46

ఇదిలా ఉంటే కోలీవుడ్ మీడియా ముచ్చటించిన సమంత విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండకు ఆమె మిస్టర్ పర్ఫెక్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. అందరూ అనుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ రౌడీ, రెబల్ కాదని ఆమె అసలు విషయం బయటపెట్టాడు. 

56

పక్కనే ఉన్న విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ... విజయ్ దేవరకొండను రౌడీ ఫెలో అని పిలుస్తుంటే నేను చాలా రెబల్ అనుకున్నాను. వాస్తవంలో విజయ్ దేవరకొండ చాలా మంచోడు. అతనికి ఒక్క చెడ్డ అలవాటు లేదు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తాడు. వర్క్ పట్ల నిబద్ధతగా ఉంటాడు. విజయ్ దేవరకొండ గురించి తెలిశాక నా అభిప్రాయం మారిపోయింది. నేను షాక్ అయ్యాను... అని ఆమె చెప్పుకొచ్చారు. 
 

66

విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ రౌడీ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆఫ్ స్క్రీన్ లో వేదికలపై కూడా అతడు కొంచెం పరుషంగా మాట్లాడతాడు. దీంతో విజయ్ దేవరకొండకు ఆటిట్యూడ్, మనిషి కరుకు, అతనికి ఆల్కహాల్, ఉమెన్ వంటి అలవాట్లు కూడా ఉన్నాయని కొందరు భావిస్తారు. సమంత కామెంట్స్ ఈ అభిప్రాయం మార్చేశాయి. 
 

click me!

Recommended Stories