వరలక్ష్మి వత్రం సందర్భంగా.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన యంగ్ బ్యూటీలు..

Published : Aug 25, 2023, 09:18 PM IST

వరలక్ష్మి వత్రం పూజా కార్యక్రమాల్లో టాలీవుడ్ యంగ్ హీరోయిన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసి ఆకట్టుకుంటున్నాయి. ట్రెడిషన్ లుక్ మెరిసిన వారి ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.  

PREV
16
వరలక్ష్మి వత్రం సందర్భంగా.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన యంగ్ బ్యూటీలు..

యంగ్ హీరోయిన్, కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ (Pranitha Subhash)  తమ ఇంట్లో జరిపిన వరలక్ష్మి వ్రతం పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించి అచ్చం తెలుగమ్మాయిలా మెరిశారు. 
 

26

సంప్రదాయాలకు ప్రణీతా చాలా గౌరవం ఇస్తుంది. తెలుగు పండుగులను కూడా ఈ ముద్దుగుమ్మ జరుపుకుంటుంది. తాజాగా పట్టుచీరలో మెరిసి ఆకట్టుకుంది. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలిపింది. 
 

36

‘బిగ్ బాస్’ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory)  గ్లోరీ వరలక్ష్మి వ్రతం పూజల్లో పాల్గొంది. పింక్ శారీలో సంప్రదాయ లుక్ లో మెరిసిపోయింది. దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంది.

46

యంగ్ హీరోయిన్ దివి వాద్య (Divi)  వరలక్ష్మి వ్రతం సందర్భంగా దేవాలయాన్ని సందర్శించింది. అక్కడ అమ్మవారిని దర్శించుకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. పూజారి ఆశీస్సులు తీసుకుంది. ఎల్లో శారీలో సంప్రదాయంగా మెరిసి ఆకట్టుకుంది. 
 

56

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba)  కూడా ఆలయాన్ని సందర్శించింది. ట్రెడిషనల్ డ్రెస్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ దర్శనం అనంతరం ఫొటోకు ఇలా ఫోజుచ్చింది. దైవ సన్నిధిలో సంప్రదాయ దుస్తుల్లో మెరిసి ఆకట్టుకుంది. 

66

‘బిగ్ బాస్’ ఫేమ్, నటి అషురెడ్డి (Ashu Reddy)  తమ ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం  పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. ఈ సందర్భంగా లెహంగా, వోణీలో సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోయింది. సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకుని ఆకట్టుకుంది.
 

click me!

Recommended Stories