దీప్తి సునైనా అదిరిపోయే డాన్స్.. నెటిజన్ల క్రేజీ కామెంట్స్.. ఆయనతో పోల్చుతున్నారే!

First Published | Feb 7, 2023, 3:01 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్  దీప్తి సునైనా (Deepthi Sunaina) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. క్రేజీ పోస్టులతో ఆకట్టుకుంటారు. తాజాగా ఆమె అదిరిపోయే డాన్స్ వీడియోను షేర్ చేసుకుంది. 
 

యూట్యూబ్ స్టార్ గా దీప్తి సునైనాకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. మంచి డాన్సర్ గానూ గుర్తింపు తెచ్చుకుంది. నటిగా రాణించేందుకు ప్రస్తుతం బాగా శ్రమిస్తున్నారు దీప్తి సునైనా. ఈ క్రమంలో అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది.

హీరోయిన్ అవ్వాలనే లక్ష్యంతో ఎంటర్ టైన్ మెంట్ రంగంలో అడుగుపెట్టన దీప్తి సునైనా.. తొలుత యూట్యూబ్ లో క్రేజ్ దక్కించుకుంది. దాంతో కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో అవకాశం దక్కించుకున్నారు. తనదైన శైలిలో టీవీ ఆడియెన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. 


Bigg Boss నుంచి బయటికి వచ్చాక దీప్తి సునైనాకు మరింతగా ఫేమ్ దక్కింది. ఈ క్రేజ్ ను కాపాడుకుంటూ కేరీర్ లో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోందీ భామ. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. 

డాన్స్ వీడియోలు, పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ సందడి చేస్తున్నారు. మరోవైపు  క్రేజీ ఫొటోషూట్లు, అదిరిపోయే డాన్స్ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ నెట్టింట దుమారం రేపుతున్నారు. అయితే, తాజాగా పంచుకున్న ఓ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 

తమిళ స్టార్ విశాల్ ఎనెమీ చిత్రంలోని Tum Tum సాంగ్ కు అదిరిపోయే డాన్స్ స్టెప్పులేసి ఆకట్టుకుంది. దీప్తి డాన్స్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే, దీప్తి కేవలం టాప్ మాత్రమే ధరించి డాన్స్ చేయడంపై నెటిజన్లు క్రేజీగా స్పందిస్తున్నారు. 
 

ట్రెడిషనల్ లుక్ లో చాలా అందంగా కనిపించే దీప్తి సునైనా ఈ పాటకు ఇలా దర్శనమివ్వడం నచ్చలేదంటున్నారు. పైగా ‘మామగారు’ చిత్రంలో సీనియర్ నటుడు బాబు మోహన్ క్యారెక్టర్ ను గుర్తుచేసిందంటూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తన పెర్ఫామెన్స్ ను మెచ్చుకుంటున్నారు. ఏదేమైనా దీప్తి సునైనా నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటూ క్రేజ్ పెంచుకుంటున్నారు. ఫ్యాన్స్, నెటిజన్లు కూడా ఆమెకు మంచి సపోర్ట్ అందిస్తున్నారు. 
 

Latest Videos

click me!