ట్రెడిషనల్ వేర్ లో ముద్దుగా రెడీ అయ్యి.. అందంతో మంత్రముగ్ధులను చేస్తున్న సదా..

First Published | Sep 7, 2023, 12:27 PM IST

సంప్రదాయ దుస్తుల్లో సీనియర్ నటి సదా వెలిగిపోతోంది. బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ అందంతో కట్టిపడేస్తోంది. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. 
 

సీనియర్ హీరోయిన్, ‘జయం’ బ్యూటీ  సదా (Sada) ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే మళ్లీ వెండితెరపై మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మంచి అవకాశాల కోసం వేచి చూస్తున్నట్టు కనిపిస్తోంది. 
 

వెండితెరకు చాలా కాలం దూరంగా ఉన్నప్పటికీ సదా బుల్లితెరపై మాత్రం సందడి చేస్తూనే వస్తోంది. టీవీ షోలతో అలరిస్తూనే ఉంది. ‘ఢీ’, ‘నీతోనే డాన్స్’ వంటి షోలకు జడ్జీగా వ్యవహరించి ఆకట్టుకుంది. తన ఫ్యాన్స్ తో పాటు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను ఫిదా చేసింది.
 


ఇక ఇప్పుడిప్పుడే సదా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఆ మధ్యలో ‘హాల్ వరల్డ్’ సిరీస్ తో ఓటీటీ సందడి చేసింది. ఇక రీసెంట్ గా తేజ దర్శకత్వంలో అభిరామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అహింస’లోనూ మెరిసింది. కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది.
 

మున్ముందు సదా ఎలా సినిమాలు చేస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెను సోషల్ మీడియాలోనూ ఫాలో అవుతూ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు సదా కూడా ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ అట్రాక్ట్ చేస్తోంది.

సినిమాల గురించి పెద్దగా అప్డేట్స్ ఇవ్వకపోయినా తన వ్యక్తిగత విషయాలను మాత్రం పంచుకుంటోంది. టూర్స్, వెకేషన్లు, తదితర అంశాలపై స్పందిస్తూ వస్తోంది. ఇదే సమయంలో బ్యూటీఫుల్ లుక్ లో ఫొటోషూట్లు కూడా చేస్తూ కట్టిపడేస్తోంది. తాజాగా మరిన్ని పిక్స్ ను పంచుకుంది.

లేటెస్ట్ పిక్స్ లో సదా లెహంగా వోణీలో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ లో వెలిగిపోయింది. క్యూట్ స్మైల్ తో కట్టిపడేసింది. నిషా కళ్లతో కుర్రాళ్లపై అందాల విసిరింది. శ్రీకష్ణ జన్మాష్టమి సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్  నెట్టింట వైరల్ గా మారాయి. 
 

Latest Videos

click me!