ఇష్టం లేదు అంటూనే టాటూ వేయించుకున్న సదా..? కారణమేంటంటే..?

First Published | Jan 31, 2023, 4:14 PM IST

‘జయం’ బ్యూటీ సదా తాజాగా టాటూ వేయించుకుంది. సినీ ఫీల్డ్ లో ఉన్నా.. ఇప్పటికీ ఒక్క టాటూ కూడా లేదంట. తాజాగా ఆ రూల్ ను బ్రేక్ చేశారు. తనకు నచ్చిన టాటూను వేయించుకుంది. దానికి వెనక ఉన్న సీక్రెట్ ను రివీల్ చేశారు.
 

టాటూ.. ఏదో సరదాగా అలవాటై వ్యసనంగా మారుతుందంటుంటారు. ఒకసారి ఒంటిపై ఏదో మూలన చేరిందంటే.. మరోకటి వేయిస్తే బాగుండనే ఆలోచన పుట్టుకొస్తుందని టాటూ ప్రియులు చెబుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా హీరోయిన్ సదా ఓ టాటూను వేయించింది. 
 

తన జీవితంలోనే మొట్టమొదటి టాటూ (Tattoo)ను వేయించుకోవడం పట్ల సంతోషించింది. ఆ విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే తను టాటూ వేయించుకోవడం వెనుక ఓ రీజన్ కూడా ఉందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ నోట్ రాస్తూ వివరించింది.
 


కొందరు  "నెవర్ సే నెవర్" అని చెబుతుంటారు. అయితే.. జీవితంలో ఏదీ స్థిరంగా ఉండదని నేను భావించాను. అందుకే టాటూ వేసుకునే ఆలోచనకు ఒకప్పుడు నేను చాలా వ్యతిరేకం. కొన్ని సంవత్సరాలు దానిపై ఆసక్తి కలగలేదు. కానీ ఆ ఆలోచన మారింది. నాకు శాకాహారులైన పిల్లులంటే (పెద్దవి మరియు చిన్నవి రెండూ) చాలా ఇష్టం. 

నేను ఉన్నంత కాలం అవి నా జీవితంలో అలాగే ఉంటాయి. కాబట్టి వాటి మీద ప్రేమతో టాటూ వేయించాను. అదీ ఓ శాఖాహారి అయిన టాటూ ఆర్టిస్ట్ తో’.. అంటూ ఓ వీడియో ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా క్యాట్ కాలి గుర్తుతో పాటు నాలుగు ఆకులు ఉన్న రిమ్మలాంటి గుర్తును టాటూగా వేయించింది. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉంది. 
 

నిజ జీవితంలోనూ సదా శాఖాహారి అనే విషయం తెలిసిందే. ఇక టాటూ వేయించుకొని మరీ తనకు మూగజీవాల పట్ల ఉన్న ప్రేమను చాటుకుంది. ఆ కారణంతోనే టాటూ వేయించుకోవడం పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా సదా పంచుకున్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  
 

ఇక హీరోయిన్ సదా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం అవకాశాల కోసం చూస్తున్నట్టు కనిపిస్తోంది. అప్పటి వరకు అభిమానులకు సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఆకట్టుకుంటోంది. ఇటీవల ‘ఢీ’డాన్స్ షో,  ‘హాలో వరల్డ్’ వెబ్ సిరీస్ లో మెరిసింది. 
 

Latest Videos

click me!