అదిరిపోయే గౌన్ లో ‘జయం’ బ్యూటీ గ్లామర్ మెరుపులు.. కిర్రాక్ ఫోజులతో మత్తెక్కిస్తున్న సదా

First Published | Aug 20, 2023, 5:18 PM IST

సీనియర్ నటి సదా వరుస ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది. యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చేలా అందంగా మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా బ్యూటీఫుల్ గౌన్ లో అదిరిపోయే ఫొటోషూట్ చేసింది. 
 

‘జయం’ సినిమాతో సినీ కెరీర్ ను ప్రారంభించిన సదా (Sada).. కొన్నేళ్ల పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. బడా స్టార్స్ సరసన నటించి మెప్పించింది. తన అందం, నటనతో ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకుంది. 
 

అలాగే ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ లోనే కాకుండా విభిన్న పాత్రలు కూడా పోషించి ప్రేక్షకులను అలరించింది. చివరికి వేశ్య పాత్రలోనూ నటించి మెప్పించింది. 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో సందడి చేసింది. 
 


ప్రస్తుతం సదా వెండితెరపై కంటే.. బుల్లితెరపైనే తెగ సందడి చేస్తోంది. 2018లో వచ్చిన ‘టార్చ్ లైట్’ చిత్రం తర్వాత సదా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఏకంగా ఐదేళ్లు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది.
 

వెండితెరకు దూరమైన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై మాత్రం సందడి చేస్తూనే ఉంది. టీవీ షోల్లో మెరుస్తూ ఫ్యాన్స్ తో పాటు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను అలరించింది. ‘ఢీ’ డాన్స్ షో, బీబీ జోడీ తెలుగు షోలకు జడ్జీగా వ్యవహరించి ఆకట్టుకుంది. 
 

డాన్స్ షోలో జడ్జీగా వ్యవహరిస్తూనే.. మరోవైపు గ్లామర్ మెరుపులతో షోకు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారారు. సదా జడ్జీగా నిర్వహించిన సీజన్లలోనూ షోకు మంచి వ్యూస్ దక్కాయి. తన అందంతో, నయా లుక్స్ తో, జడ్జీమెంట్ తో ఆడియెన్స్ ను ఫిదా చేసింది. 
 

ఇప్పటికే సదా బుల్లితెరపైనే అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న డాన్స్ రియాలిటీ షో ‘నీతోనే డాన్స్’ (Neethoney Dance)  కు జడ్జీగా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం సదా వరుసగా ఫొటోషూట్లు చేస్తోంది. 
 

అదిరిపోయే అవుట్ ఫిట్లలో నయా లుక్స్ తో సదా షోలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో లేటెస్ట్ ఎపిసోడ్ కోసం బ్యూటీఫుల్ డ్రెస్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను అభిమానులతో పంచుకోవడంతో ఖుషీ అవుతున్నారు. జయం బ్యూటీ ట్రెడిషనల్ లుక్ కు ఫిదా అవుతున్నారు. 
 

తాజాగా సదా షేర్ చేసుకున్న పిక్స్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. పర్పుల్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ లో సదా మెరిసిపోయింది. క్యూట్ గా ఫొటోలకు ఫోజులిచ్చి  కట్టిపడేసింది. అందంగా నవ్వుతూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. మత్తు చూపులతో మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే.. సదా రీసెంట్ గా ‘అహింస’ చిత్రంలో మెరిసింది. నెక్ట్స్ సినిమాపై ఇంకా అప్డేట్ రాలేదు. 
 

Latest Videos

click me!