టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ నెమ్మదిగా తెలుగు చిత్రాల్లో వరసగా ఆఫర్లు అందుకుంటోంది. ‘చిలసౌ’ చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటనతో ఆకట్టుకుంది.
ఆ వెంటనే ‘హిట్ : ది ఫస్ట్ కేస్’, ‘డర్టీ హరి’, ‘నూటికొక్క జిల్లాల అందగాడు’.. రీసెంట్ గా ‘హెర్ చాఫ్టర్ 1’ వంటి చిత్రాలతో అలరిస్తూనే వస్తోంది. నార్త్ కు చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులోనే భారీ ప్రాజెక్ట్ ల్లో అవకాశాలు అందుకుంటోంది.
ఇదిలా ఉంటే... వెండితెరపై నటిగా అలరించడంతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుసగా తన గురించి అప్డేట్స్ అందించేలా పోస్టులు పెడుతూ వస్తోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది.
అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందాల వల విసురుతూ తనవైపు తిప్పుకుంటోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాల్దీవుల్లో రచ్చ చేస్తోంది. తన వెకేషన్ నుంచి తాజాగా కొన్ని ఫొటోలనూ షేర్ చేసుకుంది.
లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు నెట్టింట అందాల దుమారం రేపాయి. బీచ్ వేర్ లో దర్శనమిచ్చిన రుహానీ శర్మ స్టన్నింగ్ ఫోజులతో మంత్రముగ్ధులను చేసింది. మరోవైపు క్రిస్ క్రాస్ టాప్ లో ఎద అందాలను ప్రదర్శిస్తూ మతులు చెడగొట్టింది. మొత్తానికి యంగ్ బ్యూటీ ఫొటోలను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్ చేస్తూ, కామెంట్లతో వైరల్ గా మారుస్తున్నారు.
ఈ కుర్రభామను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యూటీ తెలుగు, తమిళం, మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వగా.. హిందీలోనూ డెబ్యూ మూవీ ‘అగ్ర’లోనటిస్తోంది. ఇక తెలుగులో ‘హిట్’ డైరెక్టర్ సైలేష్ కొలను - వెంకటేశ్ కాంబోలో వస్తున్న ‘సైంధవ్’లో హీరోయిన్ గా నటిస్తోంది.