అందానికి చిరునామాగా మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్... ఇలా ఎలా మేడమ్!

Sambi Reddy | Published : Sep 10, 2023 2:06 PM
Google News Follow Us


 నమ్రతా శిరోద్కర్ వయసు రివర్స్ అవుతుందా అనే సందేహం కలుగుతుంది. 51 ఏళ్ల నమ్రత కాలేజ్ గర్ల్ లుక్ మైంటైన్ చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

16
అందానికి చిరునామాగా మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్... ఇలా ఎలా మేడమ్!
Namrata Shirodkar


నమ్రత శిరోద్కర్ తన లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీ రూపొందించిన బట్టలో ఆమె సూపర్ స్టైలిష్ గా దర్శనమిచ్చారు. నమ్రత శిరోద్కర్ యంగ్ లుక్ వైరల్ అవుతుంది.  

26
Namrata Shirodkar

నమ్రత ఇంత యంగ్ గా కనిపించడానికి కారణం క్రమశిక్షణతో కూడిన జీవన విధానం. నమ్రత దినచర్యలో వ్యాయామం భాగంగా ఉంది. ప్రతి రోజూ క్రమం తప్పకుండా జిమ్ కి వెళతారు. ఆహార నియమాలు పాటిస్తారు. అన్నింటికీ మించి మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. అదే ఆమె బ్యూటీ సీక్రెట్. 

 

36
Namrata Shirodkar

ముంబైలో పుట్టిన పెరిగిన ఒక స్టార్ హీరోయిన్ తెలుగింటి కోడలు కావడం, ఇక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం. మహేష్ కోసం కెరీర్ వదిలేసిన నమ్రత పరిపూర్ణమైన గృహిణి అవతారం ఎత్తింది. పెద్ద వారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సాంప్రదాయంగా నమ్రత ఉంటారు. 

Related Articles

46
Namrata Shirodkar

ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన నమ్రత వాళ్ళ ఆలనా పాలనా చూసుకున్నారు. ప్రేమగా పెంచి పెద్ద చేశారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మహేష్ కెరీర్ పై ఆమె ఫోకస్ పెట్టారు. మహేష్ కి మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. 

 

56

మహేష్ ఎండార్స్మెంట్, వ్యాపారాలు, సినిమా డేట్స్ నమ్రతనే చూసుకుంటారు. అదే సమయంలో మహేష్ భార్య నమ్రతకు చాలా గౌరవం ఇస్తారు. కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. మహేష్ కి సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం. ఏమాత్రం విరామం దొరికినా భార్యాపిల్లలతో ఫారిన్ ట్రిప్ కి చెక్కేస్తారు. 

66

దాదాపు ఐదేళ్లు వీరి మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్-నమ్రతల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని రహస్య వివాహం అనొచ్చు. మహేష్ కంటే వయసులో నమ్రత పెద్దది కావడం విశేషం. 
 

Recommended Photos