Roja: నాకు నోరెక్కువ.. అందుకే హీరోయిన్లు ఏం చేసేవారంటే? రోజా సంచలన కామెంట్స్

Published : Nov 20, 2026, 10:36 AM IST

Roja: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో దూకుడుగా, నిర్మొహమాటంగా మాట్లాడే నటి రోజా, ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రోజా గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన స్వభావం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తోటి హీరోయిన్ల గురించి సంచలన కామెంట్స్ చేశారు.

PREV
13
సౌత్ ఇండస్ట్రిని ఊపేసిన హీరోయిన్..

90ల కాలంలో టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోయిన హీరోయిన్లలో రోజా ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి టాలీవుడ్ అగ్ర హీరోలతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది రోజా. తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో విజయ్ కాంత్, శరత్ కుమార్, రజినీకాంత్ లాంటి స్టార్స్ కు జంటగా నటించి మెప్పించింది. హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తరువాత చాలా తక్కువ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన రోజా.. రాజకీయాల్లో బిజీ అయిపోయింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేసిన ఆమె.. ప్రస్తుతం ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న తార

రోజా అంటే అందరికి గుర్తొచ్చేది.. ఆమె టాకింగ్ పవర్. సినిమాల్లో కానీ.. రాజకీయాల్లో కానీ.. రోజా అంటే అందరు భయపడుతుంటారు. ఆమె ఏదైనా విషయంలో మాట్లాడటం మొదలు పెడితే.. ఎంతటి వారైన తగ్గక తప్పదు. అసెంబ్లీలో కానీ.. ఏదైనా సభలో కానీ రోజా మాట్లాతుందంటే అందరు ఇంట్రెస్ట్ గా వింటుంటారు. బోల్డ్ కామెంట్స్ చేయడంలో ఆమె ముందుంటారు. ఈ విషయంలో ఎన్నో విమర్శలు కూడా ఫేస్ చేశారు రోజా. అందుకే ఆమెకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది.

23
నేరుగా అడిగే స్వభావం

ఎన్నో ఇంటర్వ్యూలలో రోజా కామెంట్స్ వైరల్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా ఆమెకు ఎదురైన ప్రశ్నల్లో మీ హీరోయిన్లలో మీతో ఎవరైనా విలన్ లాగా ప్రవర్తించిన వారు ఉన్నారా అని హోస్ట్ అడిగినప్పుడు రోజా చెప్పిన ఆన్సర్ విని అంతా ఆశ్చర్యపోయారు.

తనతో అంత ధైర్యం ఎవరూ చేయరని రోజా అన్నారు. దానికి గల కారణాన్ని వివరిస్తూ, తనకు "నోరు ఎక్కువ" అని ఎవరైనా తన గురించి ఏమైనా అన్నారని తెలిస్తే, వెంటనే వెళ్లి నేరుగా ప్రశ్నించే అలవాటు తనకు ఉందని చెప్పారు. వెనుక మాట్లాడటం కంటే, ధైర్యం ఉంటే ముందు మాట్లాడాలని, ఇలా ఎందుకు అన్నారని కరెక్ట్‌గా నిలదీసి అడుగుతానని రోజా అన్నారు.

33
అందుకే ఎవరూ అనరు

తనకు ఉన్న ఈ ముక్కుసూటితనం వల్లే ఎవరూ తన విషయంలో వెనక మాట్లాడే సాహసం చేయరని రోజా చెప్పారు. ఎవరైనా తనను ఏమైనా అనాలనుకున్నా, మళ్లీ ఈమె వచ్చి అందరి మధ్యలో నిలదీసి అడిగితే ఎక్కడ తల పెట్టుకోవాలి అనే ఆలోచన వాళ్లకు ఉంటుందని చెప్పారు. అనవసరంగా గొడవ ఎందుకని భావించి చాలామంది ఆ విషయంలో వెనకడుగు వేస్తారని ఆమె వివరించారు. తనలోని ఈ ధోరణిని ఒక రకమైన బలహీనతలా కాకుండా, తనను తాను కాపాడుకునే ఆయుధంలా మారిందని ఆమె సరదాగా చెప్పుకొచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories