Jayasudha: ఎన్టీఆర్, ఏఎన్నార్ నా తండ్రికంటే చాలా పెద్దవాళ్లు.. షూటింగ్ లో జయసుధ ఫీలింగ్స్ ఎలా ఉండేవంటే?

Published : Nov 20, 2026, 07:56 AM IST

Jayasudha: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సహజనటి జయసుధ. ఈమధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో కలిసి పనిచేసినప్పటి జ్ఞాపకాలను ఆమె పంచుకున్నారు. స్టార్లతో నటించేటప్పుడు ఎమోషన్స్ ఎలా ఉండేదో ఆమె వివరించారు.

PREV
14
మూడు తరాలతో నటించిన తార..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సహజనటి అన్న పేరు జయసుధకు మాత్రమే ఉంది. నేచురల్ యాక్టింగ్ తో అద్భుతమైన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ను అలరిస్తూ వస్తోంది ఈ నటి. జయసుధ మూడు తారాల హీరోలతో కలిసి నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, మోహన్ బాబు, మురళీ మోహన్ వరకూ హీరోలతో జంటగా నటించిన జయసుధ.. ఆతరువాత తరం హీరోలకు తల్లిగా, భామ్మగా కూడా నటించి మెప్పించింది.

24
తొలి రోజుల్లో ఇబ్బంది - భయం

కెరీర్ ప్రారంభంలో నందమూరి తారక రామారావుతో పనిచేసేటప్పుడు మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉండేదని జయసుధ తెలిపారు. అప్పటికే ఎన్టీఆర్ గారు తన నాన్నగారి కంటే చాలా పెద్దవారు కావడం వల్ల అలా అనిపించేదని చెప్పారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి విషయంలోనూ తన నాన్నగారి కంటే వయసులో చాలా పెద్దవారు కావడంతో తొలుత అలాంటి భావన ఉండేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏఎన్నార్ గారితో నటించేటప్పుడు, ఆయన డైలాగ్స్ విన్నప్పుడు మొదట్లో చాలా భయం వేసేదని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే, సెట్‌లో ఒక నాలుగైదు రోజులు కలిసి పనిచేసి మాట్లాడిన తర్వాత, ఆ వయసు వ్యత్యాసం లేదా పెద్ద చిన్న అనే భావనలు పోయి, పాత్రల పరంగానే కలిసిపోయేవారని వివరించారు.

34
శోభన్ బాబు, కృష్ణతో అనుబంధం

శోభన్ బాబు, కృష్ణ వంటి నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత వచ్చిన తరానికి చెందిన వారని జయసుధ అన్నారు. శోభన్ బాబుని మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉంటారోనని అనిపించినా, ఆయన చాలా సరదాగా, నవ్వుతూ, ఫ్రెండ్లీగా మాట్లాడేవారని చెప్పారు. ఒకసారి శోభన్ బాబు స్వయంగా వచ్చి తనను కలిశారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ తరం నటులతో వేరే రకమైన అనుబంధం, వాతావరణం ఉండేదని పేర్కొన్నారు.

44
వాహిని స్టూడియోస్ జ్ఞాపకాలు

వాహిని స్టూడియోస్‌లో షూటింగ్ జరుగుతున్నప్పటి రోజులను జయసుధ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అప్పట్లో మేకప్ రూమ్‌లు వేరే చోట ఉండేవని, షూటింగ్ ఫ్లోర్స్ ఎదురెదురుగా లేదా పక్కపక్కనే వరుసగా ఉండేవని తెలిపారు. నేటి రోజుల్లో ఉన్నట్లుగా అప్పట్లో ప్రతి ఆర్టిస్ట్‌కు వ్యానిటీ వ్యాన్‌లు ఉండేవి కావని వివరించారు. మేకప్ వేసుకున్న తర్వాత ఒక చోట నుంచి మరో చోటికి కారులో వెళ్లేంత హడావుడి లేదా అంత సీన్ ఉండేది కాదని, అప్పటి షూటింగ్ వాతావరణం భిన్నంగా ఉండేదని జయసుధ వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories