Gopichand: విలన్ గా, హీరోగా గోపీచంద్ కెరీర్ లో టాప్ 6 మూవీస్ ఇవే.. ఎలా ఉండేవాడు ఎలా అయ్యాడు ?

Published : Nov 20, 2026, 09:47 AM IST

క్రేజీ హీరో గోపీచంద్ విలన్ గా గుర్తింపు పొందిన తర్వాత హీరోగా సినిమాలు చేశారు. మాస్ చిత్రాలకు పర్ఫెక్ట్ కటౌట్ అనే గుర్తింపు గోపీచంద్ కి ఉంది. అలాంటి గోపీచంద్ కేరీర్ లో బెస్ట్ మూవీస్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
17
Gopichand

హీరో గోపీచంద్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా, ఆరడుగుల కటౌట్ తో యాక్షన్ చిత్రాల్లో మెప్పిస్తూ రాణిస్తున్నాడు. గోపీచంద్ కి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. గోపీచంద్ హీరోగా కెరీర్ మొదలు పెట్టినప్పటికీ విలన్ గా నటించినప్పుడే మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత తిరిగి హీరోగా నటించి సక్సెస్ అందుకున్నాడు. యజ్ఞం చిత్రంతో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. విలన్ గా, హీరోగా గోపీచంద్ నటించిన బెస్ట్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

27
జయం

నితిన్ కి ఇది డెబ్యూ మూవీ. ఈ చిత్రంలో గోపీచంద్ విలన్ గా అదరగొట్టారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. నితిన్, సదా, గోపీచంద్ అందరికీ ఈ చిత్రంతో మంచి పేరు వచ్చింది.

37
వర్షం

జయంలో గోపీచంద్ పోషించిన పాత్ర, వర్షంలో పోషించిన పాత్ర సిమిలర్ గా ఉంటాయి. కోరుకున్న అమ్మాయిని వదిలిపెట్టని నైజం. కానీ వర్షం యాక్షన్ తో కూడిన లవ్ స్టోరీగా తెరకెక్కింది. ప్రభాస్, గోపీచంద్ మధ్య పోరాటం రసవత్తరంగా ఉంటుంది. ఈ సినిమాతోనే గోపీచంద్, ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

47
యజ్ఞం

విలన్ గా గుర్తింపు పొందాక గోపీచంద్ హీరోగా నటించిన తొలి చిత్రం ఇదే. యజ్ఞం మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. మాస్ చిత్రాలకు తాను పర్ఫెక్ట్ ఛాయిస్ అనే ఫీలింగ్ ని గోపీచంద్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో కలిగించారు. ఆ తర్వాత గోపీచంద్ ఇక హీరోగానే సినిమాలు చేయడం ప్రారంభించాడు.

57
లక్ష్యం

గోపీచంద్, అనుష్క శెట్టి జంటగా నటించిన మూవీ ఇది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో జగపతి బాబు, కోట శ్రీనివాస రావు కీలక పాత్రల్లో నటించారు.

67
సాహసం

గోపీచంద్ మాస్ సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేశారు. అందులో సాహసం ఒకటి. వైవిధ్యమైన కథాంశంతో అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిన సాహసంలో గోపీచంద్ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ఇప్పటికీ ఈ చిత్రాన్ని టీవీల్లో, యూట్యూబ్ లో ప్రేక్షకులు రిపీట్ గా చూస్తూనే ఉంటారు.

77
గౌతమ్ నంద

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ నటించిన ఈ మూవీ కమర్షియల్ అంశాలు ఉన్న చక్కటి కథ. ఈ చిత్రం కమర్షియల్ గా అంతగా వర్కౌట్ కాలేదు కానీ కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కించుకుంది. ఈ మూవీలో గోపీచంద్ డ్యూయెల్ రోల్ లో అదరగొట్టారు.

గౌతమ్ నంద తర్వాత గోపీచంద్ నటించిన సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ తర్వాత నటించిన 9 చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు గోపీచంద్ మార్కెట్ ప్రమాదంలో పడింది. గతంలో మాస్ సినిమాలతో మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్న గోపీచంద్ ఇప్పడు ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎలా ఉండే గోపీచంద్ ఎలా అయిపోయాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ సంకల్ప్ దర్శకత్వంలో భరతవర్ష అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో గోపీచంద్ కంబ్యాక్ ఇవ్వాలసిందే.

Read more Photos on
click me!

Recommended Stories