Soundarya, Venkatesh
విక్టరీ వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉండే నటుడు. వెంకీ గురించి ఎప్పుడూ ఎవరూ చెడుగా మాట్లాడారు. కూల్ గా తన సినిమాలు తాను పూర్తి చేసుకుంటూ ఇన్నేళ్ళుగా వెంకీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం తన బలాన్ని నమ్ముకున్న వెంకీ ఫ్యామిలీ కథలపై ఫోకస్ పెట్టారు. సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. గతంలో వెంకటేష్ వరుసపెట్టి కుటుంబ కథ చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి.
వివాద రహితుడైన వెంకటేష్ ని ఒక సందర్భంలో రోజా ఇష్టం వచ్చినట్లు తిట్టిందట. వెంకీని మాత్రమే కాదు.. వెంకీ, సౌందర్య ఇద్దరినీ ఆమె టార్గెట్ చేస్తూ తీవ్రమైన విమర్శలు చేసింది. ఆ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వెంకటేష్, సౌందర్య నటించిన సూపర్ హిట్ చిత్రం రాజా విషయంలో ఈ వివాదం జరిగింది. 1998లో రోజా, తమిళ హీరో కార్తీక్ జంటగా ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్ అనే చిత్రంలో నటించారు. ఆ మూవీ సూపర్ హిట్ అయింది.
Also Read: చిరంజీవితో రొమాన్స్ చేసిన స్టార్ హీరోల భార్యలు ఎవరెవరో తెలుసా, అక్కాచెల్లెళ్లు కూడా..
దీనితో నిర్మాతలు రోజాని పక్కన పెట్టి సౌందర్యని ఎంపిక చేసుకున్నారు. నేను వెంకటేష్ తో నటించిన పోకిరి రాజా ఫ్లాప్ అయింది అని రాజా చిత్రం నుంచి నన్ను తొలగించారు. మరి వెంకటేష్, సౌందర్య నటించిన సూపర్ పోలీస్ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది కదా. ఆ తర్వాత వెంకటేష్ సౌందర్యతో ఎందుకు సినిమాలు చేశారు. రాజా చిత్రానికి నేను పనికిరానా ? తమిళంలో నటించింది నేనే కదా. సౌందర్యలా నటించలేనా అంటూ రోజా విమర్శలతో విరుచుకుపడ్డారు.
Soundarya
రోజా విమర్శలకు వెంకటేష్ కోపం తెచ్చుకోకుండా కూల్ గా మీడియాకి అప్పట్లో సమాధానం ఇచ్చారట. హీరోయిన్ ఎంపిక అనేది దర్శకుడు, నిర్మాత చేతుల్లో ఉంటుంది. దర్శకుడు చెప్పినట్లు నటించడమే హీరో పని. ఆమె విమర్శలకు నేను స్పందించను అంటూ వెంకటేష్ సమాధానం ఇచ్చారు.