భరించలేని నొప్పి.. అయినా తగ్గేదెలే.. జిమ్ లో రష్మిక మందన్న హెవీ వర్కౌట్స్..

First Published | Sep 14, 2023, 1:19 PM IST

స్టార్ హీరోయిన్  రష్మిక మందన్న తాజాగా తన వర్కౌట్ సెషన్ నుంచి ఓ వీడియోను పంచుకుంది. హెవీ వెయిట్స్ ను లిఫ్ట్ చేస్తూ మరింత ఫిట్ గా తయారవుతోంది. శ్రీవల్లి వర్కౌట్స్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
 

టాలీవుడ్ స్టార్, హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం సౌత్, నార్త్ లో భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన సినిమాల కోసం ఈ ముద్దుగుమ్మ చాలా శ్రమిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో తన గురించిన అప్డేట్స్ అందిస్తోంది. 
 

ఈ సందర్భంగా రష్మిక మందన్న వర్కౌట్ సెషన్ నుంచి ఓ వీడియోను పంచుకుంది. అందులో లెగ్స్ వర్కౌట్ చేస్తూ కనిపించింది. హెవీ వెయిట్ ను కాళ్లతో లిఫ్ట్ చేస్తూ కండరాలను మరింత బలంగా మారుతోంది. ఫిట్ నెస్ కోసం జిమ్ లో కష్టపడుతోంది. 
 

Latest Videos


మొదటి నుంచి రష్మిక ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించదు. ప్రతిరోజూ, షూటింగ్ స్పాట్ లోనూ ఎక్సర్ సైజ్ లు చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఫిట్ కనిపించేందుకు వ్యాయామం చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
 

సాధారణంగా గ్లామర్ ఫీల్డ్ లో కొన్నేళ్ల పాటు వెలుగొందాలంటే బ్యూటీతో పాటు ఫిట్ నెస్ చాలా అవసరం. ఈ విషయంలో ఫిజికల్ గా ఎల్లప్పుడూ ఫిట్ గా కనిపించడంలో రష్మిక ముందుంటుంది. తన ఫిట్ నెస్ ఆకట్టుకుంటూ ఉంటుంది. అంత నాజుగ్గా ఉండాలంటే ఇలా గంటల కొద్ది జిమ్ లో శ్రమిస్తుందని అర్థమవుతోంది.

భరించలేని నొప్పితో కూడిన వర్కౌట్స్ చేస్తుండటం, వెండితెరపై మరింత ఫిట్ గా, అందంగా మెరిసేందుకు ఆమె చేస్తున్న కృషికి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. నేషనల్ క్రష్ ఊరికే కాలేదంటూ... ఎంతో డెడికేషన్, హార్డ్ వర్క్ ఉందంటూ ప్రశంసిస్తున్నారు. 
 

ఇక రష్మిక మందన్న ప్రస్తుతం  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప2 : ది రూల్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ ‘యానిమల్’లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో ‘రెయిన్ బో’ అనే సినిమా కూడా చేస్తూ బిజీగా ఉంది. 
 

click me!