మూవీ రివ్యూ: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ చివరి చిత్రం `దిల్ బెచారా`

First Published Jul 25, 2020, 9:32 AM IST

కొన్ని సార్లు సినిమాని సినిమాలా చూడలేం. తెరపై స్టార్స్ నటన చూసి నిజం జీవితంలో వాళ్లు అలాగే ఉంటారేమో అని ఎలా భ్రమిస్తామో ...చాలా సార్లు..వాళ్ల నిజ జీవిత సంఘటనలను సైతం తెరపై పాత్రలతో కలిపేసుకుని భావోద్వేగాలకి లోనవుతాం. జాన్ గ్రీన్  2012లో రాసిన  పాపులర్ నవల ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సుశాంత్ సింగ్ పాత్రకి మనం అలాగే కనెక్ట్ అవుతాము. ఈ నవల ఆధారంగా ఇదే టైటిల్ తో 2016లో వచ్చిన సినిమా సైతం ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా కూడా ఆ స్దాయిలో ఉందా...అసలు ఈ సినిమా మెయిన్ థీమ్ ఏమిటి...సుశాంత్ సింగ్ కు అసలైన నివాళిగా ఈ సినిమా చెప్పచ్చా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటిథైరాయిడ్ కాన్సర్ తో బాధపడుతూ, జీవితంలో ఆనందం అనే పదం ఉంటుందని తెలియనట్లుగా బాగా బోరింగ్ లైఫ్ గడుపుతూంటుంది కిజీ బసు(సంజన సంఘి). ముక్కులో ఆక్సిజన్ పైప్ లేకపోతే ప్రాణానికే ప్రమాదం కాబట్టి ఎప్పుడూ ఆక్సిజన్ సిలిండర్ తన వీపుకి తగిలించుకుని తిరుగుతూంటుంది. ఆ వయస్సులో ఉండాల్సిన సరదాలు,కబుర్లు, బోయ్ ప్రెండ్స్ వంటివేమీ ఉండవు.నిస్సారంగా గడిపేస్తున్న ఆమె బోరింగ్ లైఫ్ లోకి తనకు నచ్చిన పని చేసే చలాకీ కుర్రాడు ఇమాన్యుల్ రాజ్ కుమార్ జూనియర్ అలియాస్ మానీ (సుశాంత్ సింగ్ రాజ్ పుత్) ప్రవేశిస్తాడు.
undefined
ఆమెకు అతను మొదట కాలేజీలో.. ఆ తర్వాత కాన్సర్ సపోర్ట్ గ్రూప్ లో కలుస్తాడు. అతనుంటేనే అదో ఉత్సాహం.. ప్రోత్సాహం.. ఫుల్ ఎనర్జీ. ఓ యాక్సిడెంట్ లో కాలు కోల్పోయినా.. ప్రోస్థెటిక్ లెగ్ తోనే అందరినీ నవ్విస్తూ బ్రతికేస్తుంటాడు. అతని ఉత్సాహం,ఊపు చూసి మొదట్లో కంగారుపడుతుంది కిజి. అయితే మెల్లిగా అతనితో జర్ని మొదలెడుతుంది.
undefined
ఇక మానీ కి ఓ లైఫ్ యాంబిషన్ ..ఎప్పటికైనా సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా హీరో అవ్వాలని. అందుకు డైరక్టర్ అవ్వాలనే జీవితాశయం పెట్టుకుని , కంటి క్యాన్సర్‌తో బాధపడుతూ, తన కనుచూపు పోయేలోగా సినిమా చేయాలనే జగదీష్ పాండేని కలుపుకుంటాడు. ఓ భోజపురి సినిమా ప్లాన్ చేసారు. .కాలు లేకపోయినా కూడా పట్టుదలతో డాన్స్ చేస్తాడు. జీవితంలో ఓడిపోకూడదు...అనుకున్నది,ఆశపడింది ప్రతీదీ సాధించాలి అనే పాజిటివ్ థింకింగ్ తో ఉంటాడు. అలా తన పాజిటివ్ నెస్ తో అందరినీ ఆకట్టుకుంటాడు. కిజీబసు పై కూడా ఆ ప్రభావం పడుతుంది. మెల్లిగా తన బోరింగ్ లైఫ్ నుంచి బయిటకు వస్తుంది.
undefined
ఆమె జీవితాన్ని కూడా తనలాగా ఆనందమయం చేయాలనుకుంటాడు. తన సినిమాలో హీరోయిన్ గా కిజిని సెలక్ట్ చేసి, ఒప్పిస్తారు. ఆ సినిమా ప్రయాణం మెదలవుతుంది. పనిలో పనిగా మాని – కిజిలు ప్రేమలో పడతారు. ఆ తర్వాత కిజికి ఉన్న ఒకే ఒక్క కోరిక గురించి తెలుస్తుంది. ఆమె, తనకి బాగా ఇష్టమైన పాట రాసిన అభిమన్యు వీర్(సైఫ్ అలీ ఖాన్)ని కలవాలనుకోవాలనుకుంటోందని అర్దం చేసుకుంటాడు.
undefined
ఈ లోగా కిజ్యిబసుకి ఒక మెయిల్ వస్తుంది. అది తనకి ఎంతో ఇష్టమైన పాటల రచయిత నుంచి. మీరు నన్ను కలవాలనుకుంటే పారిస్ రాగలరు అని ఉంటుంది. అయితే పారిస్ కి ఇమ్మాన్యూల్ మరియు కిజ్యిబాసు రెడీ అవుతున్న సమయంలో కిజ్యిబాసుకి ఉన్న కాన్సర్ ఎక్కువై హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది.ఇప్పుడు ఇమ్మాన్యూల్ ఏం చేసారు? ఈ క్రమంలో మాని గురించి ఓ తట్టుకోలేని నిజం కిజికి తెలిస్తుంది..అదేమిటి? చివరకు సినిమా పూర్తైందా? హ్యాపీ ఎండింగేనా? వంటి విషయాలు తెలియాలంటే 'హాట్ స్టార్' లో ఈ సినిమా చూడాల్సిందే.
undefined
ఎలా ఉంది..ఈ సినిమా మనకు మణిరత్నం గీతాంజలికు లేటెస్ట్ వెర్షన్ లా అనిపిస్తుంది. అయితే అదే సమయంలో ఈ సినిమా కొత్త కంటెంట్,ఆలోచనలను మోసుకొస్తుంది. పాజిటివ్ గా జీవితం గడిపితే ఎంతటి కష్టాన్ని అయినా తట్టుకోగలమే పాఠం చెప్తుంది. అయితే కాన్సర్ పేషెంట్స్ చుట్టూ కథ నడిపినా ఆ విషాదాన్ని తెరపై చూపించి సానుభూతి పండించాలనే ప్రయత్నం చేయకపోవటంతో పూర్తిగా చూడగలుగుతాం. కథ పూర్తిగా ముందే ఊహించగలిగినా క్యారక్టరైజేషన్ తో మనను ప్రక్కకు పోనివ్వకుండా చేస్తాడు.
undefined
అయితే కొన్ని విషయాల్లో దర్శకుడు కంగారుపడ్డాడనిపిస్తుంది. హీరోయిన్ తన తల్లి,తండ్రులతో ఉండే రిలేషన్ షిప్ ని బిల్డ్ కానివ్వడు. దాంతో క్యారక్టర్ ..పూర్తిగా సింగిల్ డైమన్షన్ గా కనపడుతుంది. అదే మనకు గీతాంజలిలో తన తండ్రితో హీరోయిన్ ..ఎటాచ్మెంట్ వంటివి పాత్రకు పరిపూర్ణత తెస్తాయి. నేపధ్యం ప్రక్కన పెడితే ఇదో కమింగ్ అప్ ఏజ్ సినిమా. ప్యారిస్ ట్రిప్ సీన్స్ సినిమాలో ఉన్నంతలో వీక్.
undefined
ఇక ఇలాంటి సినిమాలకి ఎమోషనల్ డ్రైవ్ ఎక్కువ ఎఫెక్టివ్. అది ఎంతబాగా పడితే మనం అంతబాగా లీనమవుతాం. మొదట్లో ఆ ఫీల్ ని బాగానే ఎస్టాబ్లిష్ చేస్తూ సాగినా...కొంతదూరం వెళ్లేసరికి డ్రాప్ అయ్యింది. దానికి తోడు తెలిసినట్లు అనిపించే కథ కావటంతో సినిమా కూడా అలా అలా వెళుతుంటుందే తప్ప ఎక్కడా ఎగ్జైట్ చెయ్యదు. అయితే ఆ లోపాన్ని గమనించి ప్రీ క్లైమాక్స్ దగ్గర భావోద్వేగాలతో హై తీసుకొచ్చి సరిచేసారు. ఏదైమైనా స్క్రీన్ ప్లే పరంగా ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది.
undefined
బాగున్నవిసుశాంత్ స్వచ్చమైన నవ్వు, నటనరెహమాన్ అద్బుతమైన రీరికార్డింగ్బాగోలేనివిరన్ టైమ్ అదీ డిజిటెల్ స్ట్రీమింగ్ లో బాగా ఎక్కువఇంకాస్త ఎమోషనల్ డెప్త్ అవసరంకొన్ని చోట్ల ఫోర్స్ గా అనిపించే సీన్స్
undefined
టెక్నికల్ గా ...డైరక్టర్ గా పరిచయం అయిన ముఖేష్ చబ్రా ఓ మంచి ఎమోషనల్ సినిమా తీసాడనిపించుకున్నాడు. అలాగే నటీనటుల నుంచి అద్భుతమైన నటనని రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అలాగే యాదృచ్ఛికంగా.. సుశాంత్ కి అత్యంత విశిష్టమైన నివాళి ఇచ్చాడు.ఇక ఈ సినిమా కెమెరా వర్క్, మ్యూజిక్ కు మిగతా మార్కులు పడతాయి. చాలా రోజుల తర్వాత రెహమాన్ తన విశ్వరూపం చూపించాడు. సెట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. ఇక సుశాంత్ సింగ్ అయితే ఈ సినిమాని అలా మోసుకుంటూ వెళ్లిపోయాడు. కిజూ బసు పాత్రలో సంజన సంఘీ నటన..సుశాంత్ కు పోటీ ఇచ్చింది.ఫైనల్ ధాట్సుశాంత్ సింగ్ సెంటిమెంట్ ఫాక్టర్ లేకపోయినా ఈ సినిమా బాగానే బ్రతికేది .Rating: 35--- సూర్య ప్రకాష్ జోశ్యుల
undefined
ఎవరెవరు..నటీనటులు: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజనా సంఘీ, సైఫ్ ఆలీఖాన్, సాహిల్ వేద్, సస్వతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ తదితరులుదర్శకత్వం: ముఖేష్ చాబ్రాస్క్రీన్ ప్లే: శంశాక్ ఖైతాన్, సుప్రోతిమ్ సేన్ గుప్తాసంగీతం: ఏఆర్ రెహ్మాన్ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్‌స్టార్నిర్మాత: ఫాక్స్ స్టార్ స్టూడియోరిలీజ్ డేట్: 2020-09-24
undefined
click me!