రమ్య కృష్ణ పెళ్ళి ఫోటో చూశారా..? కృష్ణవంశీతో పెళ్లిలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే..?

First Published Jun 15, 2024, 12:43 PM IST

90స్ లో తెలుగు, తమిళ పరిశ్రమను ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు. రకరకాల పాత్రల్లో మెరిసిన ఈ సీనియర్ తార.. పెళ్లి ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె పెళ్ళిలో ట్విస్ట్ ఏంటో తెలుసా..? 
 

సౌత్ ఇండియాలోని ప్రముఖ నటీమణులలో రమ్యకృష్ణ ఒకరు. హీరోయిన్ గా స్టార్ డమ్ చూసిన ఆమె.. ఆతరువాత నెగెటీవ్ క్యారెక్టర్స్ లో కూడా మెరిశారు. హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయిన తరువాత ఆమె తల్లి పాత్రలకు షిప్ట్ అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే స్టార్ డమ్ తో దూసుకుపోతున్నారు రమ్య కృష్ట. 

హీరోయిన్ గా అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించిన రమ్యకృష్ణ.. ఆతరువాత  తల్లి పాత్రల్లో కూడా అంతే  అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. రమ్యకృష్ణ పేరు  చెపితే కొన్ని పాత్రలు అలా మదిలోమెదులుతాయి. నరసింహా సినిమాలో నీలాంబరిగా.. దేవుళ్లు సినిమాలో అమ్మవారిగా.. సెకండ్ ఇన్నింగ్స్ లో బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో అద్భుతం చేసింది నటి. 
 

సినిమాలకు పవన్ కళ్యాణ్ ఇక గుడ్ బై..? క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ.. ఆ ముగ్గరు పరిస్థితి ఏంటి..?

తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించిన రమ్యకృష్ణ స్మాల్ స్క్రీన్‌పై కూడా బిజీగా ఉంది. గత 30 సంవత్సరాలుగా, రమ్య కృష్ణన్ సినిమాలు, సీరియల్స్ మరియు రియాల్టీ షోలలో ప్రొఫెషనల్ నటిగా అదరగొడుతున్నారు.

మహేష్ బాబు వాడే లగ్జరీ బ్యాగ్ చూశారా..? కాస్ట్ తెలిస్తే.. కళ్లు తిరగాల్సిందే...?

2019లో రమ్యకృష్ణ క్వీన్ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె చివరిసారిగా రజనీ సరసన తమిళ చిత్రం జైలర్‌లో నటించింది.తెలుగులో చివరిగా గుంటూరుకారంలో నటించారు రమ్యకృష్ణ. ఇన్ని చిత్రాల్లో నటించిన ఆమె.. కొన్ని వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఆమె ఆస్తుల విలువ దాదాపు 100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. 

50 ఏళ్ల వయస్సులో రొమాన్స్ కు రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్..బోల్డ్ కామెంట్స్ విన్నారా..?

ఇక హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసిన రమ్యకృష్ణ అనూహ్యంగా  2003లో తెలుగు దర్శకుడు వంశీని పెళ్ళి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వీరి పెళ్ళి అందరిని ఆశ్చర్యపరిచిందని చెప్పాలి. అంతే కాదు మధ్యలో వీరిపై రకరకాల రూమర్లు కూడా వచ్చాయి. వీరు విడాకులు తీసుకున్నారని.. విడిపోయారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. 
 

రమ్యకృష్ణ - వంశీ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని తాజాగా  జరుపుకున్నారు. కాగా, నటి రమ్యకృష్ణ పెళ్లి ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. తాము విడిపోలేదని.. కలిసే ఉన్నామంటూ..ట్రోలర్స్ కు.. నెటిజన్లకు గట్టిగా కౌంటర్ కూడా ఇచ్చారు రమ్యకృష్ణ. 
 

Latest Videos

click me!