ఇందులో మెగా, అల్లు వివాదంపై ఆచితూచి స్పందించింది నిహారిక. సాయిధరమ్ తేజ్.. బన్నీని అన్ ఫాలో చేయడంపై ఎదురైన ప్రశ్నకి, ఆ విషయం నాకు తెలియదని, మీరు అంటేనే తెలుస్తుందని, నిజంగానే అన్ ఫాలో చేస్తే అది వారి సొంత కారణాలు అయి ఉండొచ్చు అని తెలిపింది నిహారిక. ఈ క్రమంలో ఆమె మెగా, అల్లు వివాదం ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.