ఆ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను మిస్ చేసుకున్న రష్మిక.. బాధపడ్డానంటూ కామెంట్స్

First Published | Jul 23, 2023, 6:53 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ముద్దుగుమ్మ ఇద్దరు బడా హీరోల సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna)  తక్కువ సమయంలోనే అగ్రస్థాయిలో హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లోనూ చెరగని ముద్ర వేసుకుంది. 
 

‘పుష్ప’ చిత్రం తర్వాత రష్మిక మందన్న క్రేజ్ అమాంతం పెరిగిన విషయం తెలిసిందే. అప్పటి వరకు సౌత్ లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ అటు నార్త్ లోనూ వరుసగా అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్ స్టార్స్ సరసన నటిస్తూ బిజీగా ఉంది. 
 


ఏ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా ముందుగా రష్మిక పేరునే పరిశీలించే స్థాయిలో ఉన్న నేషనల్ క్రష్ ఇద్దరు బడా హీరోల సరసన నటించే ఛాన్స్ మిస్సందని చెప్పింది. అందుకు చాలా బాధపడిందంట.. ఆ స్టార్స్ ఎవరో.. ఏ సినిమాలో కూడా చెప్పింది. 
 

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay dhalapathi) సరసన ‘మాస్టర్’లో నటించాల్సి  ఉండేదని చెప్పింది. కానీ అప్పుడు కుదరక వదులుకున్నట్టు తెలిపింది. ఇక రీసెంట్ గా మాత్రం ‘వారసుడు’ చిత్రంలో నటించి మెప్పించింది. తన అభిమాన హీరోతో సినిమా చేయడం పట్ల సంతోషించింది. 
 

ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’లోనూ రష్మిక మందననే నటించాల్సి ఉండేదని తెలిపింది. ఆ చిత్రంలోనూ నటించలేకపోయిందని చెప్పింది. అలా ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో మెరవాల్సింది కొద్దిలో మిస్ అయ్యిందని చెప్పుకొచ్చింది. 
 

ప్రస్తుతం రష్మిక మందన్న ఐకాన్ స్టార్ సరసన ‘పుష్ప 2 : ది రూల్’లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లో స్టార్ హీరో రన్బీర్ కపూర్ సరసన ‘యానిమల్’లోనూ నటిస్తోంది. ఇక తెలుగులో ‘రెయిన్ బో’లోనూ మెరియనుంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. 
 

Latest Videos

click me!