బాలకృష్ణ అలా చేస్తారని అస్సలు అనుకోలేదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటి

Published : Jan 15, 2026, 12:32 PM IST

Balakrishna: సినిమాల్లో యాంగ్రీ పాత్రలు పోషించినా.. బాలకృష్ణ రియల్‌గా చాలా మంచివారని.. ఎంతోమంది నటులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆయన చేసిన ఓ మంచి పని గురించి ఇప్పుడు తెలుసుకుందామా.. 

PREV
15
బాలయ్యకు 2025 కలిసొచ్చింది..

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణకు గత ఏడాది వరుసగా హిట్స్ దక్కాయి. మొదట డాకు మహారాజ్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య.. ఆ తర్వాత ఏడాది చివర్లో 'అఖండ 2'తో మరో హిట్ కొట్టారు. ప్రస్తుతం సినిమాకు రూ. 40 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు బాలకృష్ణ.

25
యాంగ్రీ పాత్రలు.. అయినా..

బాలకృష్ణ తన సినిమాల్లో యాంగ్రీ పాత్రలు చేసినప్పటికీ.. రియల్‌గా చాలా మంచివారని ఎంతోమంది నటీనటులు చెబుతుంటారు. తాజాగా ఓ ప్రముఖ నటి కూడా ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె మరెవరో కాదు.. సీనియర్ నటి రాజ్యలక్ష్మీ.

35
ఆమె వ్యాఖ్యలు వైరల్..

బాలయ్య గొప్పదనం గురించి ప్రముఖ టాలీవుడ్ నటి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన అమ్మకు సర్జరీ జరిగిన విషయం తెలిసి బాలయ్య తన ఇంటికి వస్తానని చెప్పారని.. అదే సమయంలో బాలయ్య తల్లి బసవతారకం కూడా మరణించారని ఆమె చెప్పుకొచ్చారు. బాలయ్య తమ ఇంటికి వచ్చే సమయానికి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతోందని రాజ్యలక్ష్మీ అన్నారు.

45
బాలయ్య వెయిట్ చేసి..

ఆ సమయంలో మా ఇంట్లో బాలయ్య వెయిట్ చేసి.. వ్రతం అయిపోయాక మా అమ్మతో మాట్లాడారని రాజ్యలక్ష్మి చెప్పారు. ఇదొక్కటే కాదు.. బాలయ్య యంగ్ హీరోలతో కూడా ఫ్రెండ్లీగా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

55
రికార్డులు షేక్..

బాలకృష్ణ వరుసగా ఐదు బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్నారు. 'వీరసింహరెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్', 'అఖండ 2' లాంటి చిత్రాలు ఈ లిస్టులో ఉన్నాయి. త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories