సౌత్ ఇండియాలో 80, 90వ దశకాల్లో అంబిక, రాధ ఇద్దరూ టాప్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగారు. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో హిట్స్ కొట్టారు.
1981లో వచ్చిన 'అలైగల్ ఓయ్ వతిల్లై' సినిమాతో రాధ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అంబిక మాత్రం మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్టార్ డమ్ తెచ్చుకున్నారు.