ట్రెడిషనల్ లుక్ లో రాశీ ఖన్నా మెరుపులు.. కొంటె ఫోజులతో మంత్రముగ్ధులను చేస్తున్న యంగ్ బ్యూటీ..

First Published | Jul 25, 2023, 3:22 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో కంటే ఇతర భాషా చిత్రాల్లో నటిస్తోంది. మంచి సక్సెస్ ను అందుకుంటోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ మెరుస్తూ ఆకట్టుకుంటోంది. 
 

టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే దక్కించుకుంది. హిందీలోని ‘మద్రాస్ కేఫ్’ చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నేరుగా ‘మనం’తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. 
 

అప్పటి నుంచి వరుసగా తెలుగు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ వస్తోంది. కొన్నేళ్లుగా ఇక్కడే తన కెరీర్ ను సాగించింది. హిట్స్ ఉన్నా.. లేకున్నా తెలుగు మూవీల్లోనే నటించేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఇప్పుడిప్పుడు మాత్రం రూటు మార్చుకుంది. 
 


తెలుగులో ‘జిల్’,‘బెంగాల్ టైగర్’, ‘తొలిప్రేమ’, ‘ప్రతి రోజూ పండగే’, ‘తిరు’, ‘సర్దార్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక మూడేండ్ల నుంచి  తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీలోనూ నటిస్తూ వస్తోంది. అటు వెబ్ సిరీస్ ల్లోనూ మెరుస్తోంది. 
 

రీసెంట్ గా ఓటీటీ వేదికన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫార్జీ’ వెబ్ సిరీస్ తో మంచి హిట్ అందుకుంది. ఇక ప్రస్తుతం ‘యోదా’, ‘అరణ్మనై 4’, ‘మేథావి’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. 
 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది.  ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోల్లో బ్యూటీఫుల్ గా మెరిసింది. సిల్వర్ కలర్ శారీ లాంటి అవుట్ ఫిట్ లో హోయలు పోయింది. కాస్తా నడుమును చూపిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ ను పెంచేసింది. బ్యూటీఫుల్ గా నవ్వుతూ, క్యూట్ గా ఫోజులిస్తూ కట్టిపడేసింది. ఫ్యాన్స్ లైక్స్,కామెంట్లతో ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

Latest Videos

click me!