‘అచ్చం సమంతలా ఉన్నావ్’.. జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫొటోషూట్ కు ఫ్యాన్స్ ఫిదా.. బ్యూటీఫుల్ పిక్స్

First Published | Jul 25, 2023, 2:23 PM IST

జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha)  వరుస ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ట్రెడిషనల్ అండ్ ట్రెండీ అవుట్ ఫిట్లలో మెరుస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్  బ్యూటీఫుల్ గా ఉన్నాయి. 
 

‘జబర్దస్త్’ కామెడీ షోతో వర్ష టీవీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. తన నటనతో, కామెడీతో ప్రేక్షకులను అలరించింది. తక్కువ సమయంలోనే  మంచి క్రేజ్ దక్కించుకుంది. తన గ్లామర్ తో కట్టిపడేస్తోంది. 
 

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం వర్ష ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులను, ఫాలోవర్స్ ను ఫిదా చేస్తుంటుంది. 
 


మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ ఫొటోషూట్లు చేస్తూ అందాల దుమారం రేపుతుంటుంది. వరుసగా ఫొటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ ఫిదా చేస్తూ వస్తోంది.

ఈ క్రమంలో తాజాగా వర్ష ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. ఎల్లో చుడీదార్ లో అవుట్ డోర్ ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

తాజా పిక్స్ లో వర్ష బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే ఫోజులతో ఆకట్టుకుంది. మరోవైపు అందంగా నవ్వుతూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. తనదైన శైలిలో స్టిల్స్ ఇస్తూ చూపుతిప్పుకోకుండా చేసింది.
 

మరోవైపు ఈ ముద్దుగుమ్మ గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. మత్తుగా చూస్తూ మంత్రముగ్ధులను చేసింది. అలాగే ఎదపై నుంచి ఓణీ తీసేసి మరీ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆమె స్టిల్స్  ఫ్యాన్స్ ను ఫిదా చేశాయి. 

ఇక రూపసౌందర్యం దృష్ట్యా వర్ష కాస్తా సమంతకు దగ్గరి పోలికలను కలిగి ఉంటుంది. దీంతో నెటిజన్లు ఈ బ్యటీ లేటెస్ట్ లుక్ లో మెరవడంతో ‘అచ్చం సమంతలా ఉన్నావు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 
 

మరికొందరు వర్ష ఈ వర్షంలో ఫొటోషూట్లు ఏంటీ? ఆరోగ్యం దెబ్బతింటుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు యంగ్ బ్యూటీ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. లైక్స్,, కామెంట్లు పెడుతూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. 

ఇక వర్ష ప్రస్తుతం ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి షోలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు 7’లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

ఇప్పటికే బుల్లితెరపై సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం.. మరింతగా క్రేజ్ దక్కించుకునే అవకాశం ఉంది. దాంతో నెమ్మదిగా సినిమాల్లోనూ నటించే ఛాన్స్  దక్కించుకోనుంది. 

Latest Videos

click me!