Kajal: ఇతర హీరోయిన్లతో పోల్చితే కాజల్‌ డిఫరెంట్‌ అనడానికి 5 కారణాలు..ఈ బర్త్ డే చాలా స్పెషల్‌.. ఎందుకంటే?

Published : Jun 19, 2022, 04:05 PM IST

తెలుగు అందాల చందమామ కాజల్‌ ప్రస్తుతం ఓ వైపు మాతృత్వాన్ని అనుభవిస్తుంది. మరోవైపు పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఇంకోవైపు ఫాదర్స్ డే సెలబ్రేట్‌ చేసుకుంటుంది.   

PREV
18
 Kajal: ఇతర హీరోయిన్లతో పోల్చితే కాజల్‌ డిఫరెంట్‌ అనడానికి 5 కారణాలు..ఈ బర్త్ డే చాలా స్పెషల్‌.. ఎందుకంటే?

టాలీవుడ్‌ చందమామగా పాపులర్‌ అయిన కాజల్‌ నేడు(june 19) తన 36వ(Kajal Birthday) పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈసందర్భంగా ఆమెకి సంబంధించిన ఆసక్తికర విషయాలు వైరల్‌ అవుతున్నాయి. అదే సమయంలో ఇతర హీరోయిన్లతో కాజల్‌ చాలా స్పెషల్‌, చాలా డిఫరెంట్‌ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి స్పెషల్ ఎందుకనేది చూస్తే. 
 

28

కాజల్‌ టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ ఎదుర్కొనలేదు. చాలా మంది హీరోయిన్లకి ఆ హీరోతో ఎఫైర్‌ అని, ఆయనతో డేటింగ్‌ చేస్తుందని, దగ్గరగా మూవ్‌ అవుతుందనే కామెంట్లు, రూమర్స్ వచ్చాయి. కానీ కాజల్‌కి ఇలాంటివేవీ రాలేదు. పైగా ఆమె తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించే వరకు ఆమె లవ్‌ లో ఉందనే విషయం కూడా తెలియదు. దాదాపు ఎడేనిమిది ఏళ్లపాటు వీరిద్దరు కకలిసే తిరిగారు. సడెన్‌గా ఎంగేజ్‌మెంట్‌ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించి షాకిచ్చింది. అభిమానుల గుండెల్ని బద్దలు చేసింది. 
 

38

మరోవైపు కెరీర్‌ పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకున్న హీరోయిన్‌గానూ కాజల్‌ నిలిచింది. ఆమె చేతిలో వరుస సినిమాలున్నాయి. షూటింగ్‌లతో బిజీగా ఉంది. కామన్‌గా ఏ హీరోయిన్‌ అయినా కెరీర్‌ డౌన్‌ఫాల్‌ అవుతున్నప్పుడు, అవకాశాలు తగ్గుతున్న సమయంలోనే పెళ్లికి మొగ్గుచూపుతుంటారు. కానీ కాజల్‌ బిజీగా ఉండగానే మ్యారేజ్‌ చేసుకుంది. 

48

దీంతోపాటు కాజల్‌ టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోలతోనూ నటించింది. సీనియర్లతో తప్ప యంగ్‌ స్టార్స్ అందరితోనూ ఆడిపాడింది. తమిళంలోనూ సేమ్‌ సూపర్‌ స్టార్స్ అందరితోనూ ఆడిపాడి స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. అందరికంటే డిఫరెంట్‌ అని చాటుకుంది. స్పెషల్‌గానూ నిలిచింది. 

58

కాజల్‌ కెరీర్‌ ఎప్పుడూ డౌన్‌ ఫాల్‌ కాలేదు. పైగా అత్యధిక సక్సెస్‌ రేట్‌ ఉన్నకథానాయికగా కాజల్‌ నిలవడం విశేషం. సక్సెస్‌ , ఫెయిల్యూర్‌ ప్రభావం ఆమెపై ఏనాడూ లేదు. ప్రతి సినిమాకి ఆమె క్రేజ్‌ పెరుగుతూనే ఉంది. జయాపజయాలకు అతీతంగా స్టార్‌ ఇమేజ్‌ని పెంచుకున్న హీరోయిన్‌గా కాజల్‌ నిలిచింది. అంతేకాదు అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగానూ కాజల్‌ అందరికంటే టాప్‌లోనే ఉండటం విశేషం. 
 

68

మరోవైపు వివాదాలకు అతీతంగా కెరీర్‌ని సాగించింది కాజల్‌. ఫిల్మ్ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకపోయినా, తన అందం, అభినయంతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఎదిగే కొద్ది ఒదిగి ఉండటం కాజల్‌కే సాధ్యమైంది. కాంట్రవర్సీలకు దూరంగా క్లీన్‌ సర్టిఫికేట్‌ని పొందిందని చెప్పొచ్చు. మరోవైపు ఫ్యామిలీ విషయంలోనూ ఆమె ఏ రోజు బయటపడలేదు. ఫ్యామిలీ గొప్యతని మెయింటేన్‌ చేస్తూనే దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌ని సాగించింది. 
 

78

కాజల్‌ రెండేళ్ల క్రితం వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత నెలలో ఆమెకి పండంటి మగ బిడ్డ జన్మించారు. నీల్‌ కిచ్లుగా చిన్నారికి నామకరణం చేశారు. బిడ్డ పుట్టాక కొన్ని రోజులకే గ్లామర్‌ షోతో రచ్చ చేస్తుంది కాజల్‌. తన అందం ఏమాత్రం తగ్గలేదని, మళ్ళీ నటించేందుకు సిగ్నల్స్ ఇస్తుంది. 
 

88

ఇదిలా ఉంటే కాజల్‌ ఈ బర్త్ డే మరింత స్పెషల్‌గా నిలిచింది. ఆమె తల్లి అయ్యాక వచ్చిన మొదటి బర్త్ డే కావడం విశేషం. దీంతో ఆమె ఇంట్లో ఆనందం డబుల్‌ అయ్యిందని చెప్పొచ్చు. దీనికి తోడు మరో హ్యాపీనెస్‌ ఏంటంటే కాజల్‌ బర్త్ డే రోజే ఫాదర్స్‌ డే కావడం. ఇలా కాజల్‌ ఫ్యామిలీలో అన్ని ఆనందాలు ఒకేసారి వచ్చినట్టయ్యిందని చెప్పొచ్చు. అదే సమయంలో ఈ బర్త్‌ డే కాజల్‌ లైఫ్‌లో ఎప్పటికీ గుర్తిండిపోయే పుట్టిన రోజు అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories